Tollywood: జపాన్ లో టాప్ ప్లేస్ లో తెలుగు హీరోల హవా!

జపాన్ లో తెలుగు సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఇండియన్ సినిమాలకి బయటి దేశాల్లో మార్కెట్ ఉండడం మన సినిమాలు వాళ్ళు చూడడం ఎప్పట్నుంచో జరుగుతుంది. హిందీ మూవీస్ కి అమెరికా, ఇరాన్, దుబాయ్, ఆస్ట్రేలియా ,చైనా తో పాటు పాకిస్థాన్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇటు తమిళ సినిమాలకి థాయిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూ ఎస్ లో మార్కెట్ విపరీతంగా ఉంది. తమిళ స్టార్ హీరోల సినిమాలకి సగం వసూళ్లు బయటి దేశాల నుంచే వస్తుంటాయి. ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే తెలుగు సినిమాలను యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా ల్లో ఎక్కువగా చూస్తారు. అయితే ఇప్పుడు మన సినిమాలు జపాన్ లో కూడా విడుదల అవుతున్నాయి.

ఈ మధ్యనే జపాన్ లో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ అక్కడ ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూలు చేసి, ఇండియన్ మూవీస్ లో జపాన్ లో హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. అయితే అక్కడ ఇంతకు ముందు కుడా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. ప్రభాస్ నటించిన బాహుబలి, ఎన్టీఆర్ బాద్షా, రామ్ చరణ్ మగధీర అక్కడ మంచి ఆదరణ పొందాయి.

హిందీ నుండి దంగల్, మామ్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలు కూడా జపాన్ లో అక్కడ బాగా ఆడాయి. అయితే రీసెంట్ గా అక్కడ ఒక ప్రముఖ మూవీస్ సంస్థ జపాన్ లో మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ హీరోలు ఎవరో తెలుసుకోవడానికి ఆడియన్స్ పోల్ పెట్టింది పెట్టింది. అక్కడ హిందీ హీరోల కంటే తెలుగు హీరోలకే ఎక్కువ లైక్స్ పడ్డాయి.

- Advertisement -

ఆ పోల్ లో నెంబర్ 1 గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాగా, ఆ తర్వాత స్థానంలో రెండో స్థానంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు. ఇక మూడో స్థానములో మూడో స్థానం లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నిలిచాడు. ఏది ఏమైనా తెలుగు హీరోలు జపాన్ లో కూడా వాళ్ళ హవా కొనసాగించడం విశేషమనే చెప్పాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు