Thalapathy vijay : “లియో”లో మలయాళం స్టార్ట్ యాక్టర్ ?

మాస్టర్ , ఖైదీ , విక్రమ్ సినిమాలతో లోకేష్ కనకరాజ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరు అంటే సమాధానం లోకేష్ అనే చెప్పాలి. హాలీవుడ్ కి మాత్రమే పరిమితం అయినా సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ ని మన సౌత్ ఇండియాలో LCU పేరుతో ప్రాపర్ వె లో ప్రెసెంట్ చేసారు లోకేష్. అయితే ఈ LCU పై ( లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ) రోజు రోజుకి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.

లోకేష్ ప్రస్తుతం తలపతి విజయ్ తో “లియా” అనే సినిమా చేస్తున్నారు.ఈ సినిమా లో LCU కి సంబంధించి చాలా విషయాలు ఆయన ఎక్స్ ప్లోర్ చేయబోతున్నారు. ఇప్పటికే విజయ్ ,ఫహద్ , విజయ్ సేతుపతి , లాంటి పవర్ హౌస్ యాక్టర్స్ ఉన్న లియోలో తాజాగా మరో ఎక్స్ ఆర్డినరీ యాక్టర్ ని కాస్ట్ చేసారు లోకేష్ అతనే ఎవరో కాదు జోజు జార్జ్.

జోజు జార్జ్ మలయాళంలో మంచి పేరున్న యాక్టర్స్ లో ఒకరు. కంపెర్ చేసి చెప్పాలంటే మలయాళ విజయ్ సేతుపతి అని చెప్పొచ్చు. ఏ క్యారెక్టర్ అయినా ఈజీగా చేయగల కేపబిలిటీ ఉన్న యాక్టర్. అలాగని రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్త కథలు , కొత్త పాత్రలని ఎంచుకొని చేయడం ఈయన స్పెషలిటీ. ఈయన లేటెస్ట్ చిత్రం “ఇరాట్టా” మలయాళం లో బ్లాక్ బస్టర్ నిలిచింది. ఈ సినిమాని అదే పేరుతో ఈ మధ్యనే మన తెలుగు డబ్ చేసి ఓటిటిలో రిలీజ్ చేసారు. ఇందులో జోజు జార్జ్ యాక్టింగ్ ఎక్స్ పీరియెన్స్ చేసిన మన వాళ్ళుఆయన యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు. ఇరాట్టా సక్సెస్ తో జోజు జార్జ్ కి అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రశంశలు , అవకాశాలు వస్తున్నాయి. మరి ఇలాంటి సూపర్ టాలెంటెడ్ యాక్టర్స్ అందరిని లోకేష్ ఒక దగ్గర చేరుస్తు లియో సినిమా పై అంచనాలు పెంచుతున్నారు.

- Advertisement -

అయితే జోజు జార్జ్ ఇప్పటికే మన తెలుగులో ఒక సినిమా కమిట్ అయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా ఒక చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో జోజు జార్జ్ విలన్ గా నటిస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు