Pawan Kalyan’s BRO: పవన్ స్టామినా గట్టెక్కిస్తుందా..!

Pawan Kalyan’s BRO

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే.డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి డీసెంట్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. మూడు రోజులకు గాను 91కొట్ల గ్రాస్, 55కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమాకు సోమవారం నుండి అసలు పరీక్ష స్టార్ట్ కానుంది.

భారీ వర్షాల ఎఫెక్ట్ ఒక పక్క, టికెట్ రేట్స్ లో హైక్ లేకపోవడం వంటి అంశాల కారణంగా బ్రో సినిమాకు పవర్ స్టార్ రేంజ్ కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. 98కోట్ల షేర్ టార్గెట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఫస్ట్ డే తో కంపేర్ చేస్తే సెకండ్, థర్డ్ డే కలెక్షన్స్ కాస్త డ్రాప్ అవ్వటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

సినిమాలో పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టఫ్ ప్లస్ అయినప్పటికీ డివైడ్ టాక్ రావటానికి కూడా అదే కారణం అయ్యింది. పవన్ పాత పాటల వాడకం కొంచెం ఎక్కువ అవ్వటం వల్ల కథలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ ఎఫెక్ట్ తగ్గింది. ఇక సోమవారం బుకింగ్స్ కూడా  చాలా చోట్ల పడిపోయాయి, ఈ ఎఫెక్ట్ నాలుగవ రోజు కలెక్షన్స్ మీద పడే అవకాశం ఉంది.

- Advertisement -

బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన సినిమాలకే ఒక్కోసారి వీక్ డేస్ లో కలెక్షన్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అలాంటిది, డివైడ్ టాక్ సొంతం చేసుకున్న బ్రో సినిమాకి డీసెంట్ ఆక్యుపెన్సీ ఆశించటం అత్యాశే అవుతుందని చెప్పాలి.

వీక్ డేస్ లో కూడా ఆడియెన్స్ ని థియేటర్స్ కి రప్పించాలంటే సినిమా యూనిట్ ఎదో ఒక మ్యాజిక్ చేయాలి. సమీపంలో ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ లేవు కాబట్టి మేకర్స్ ఏదైనా ప్లాన్ చేస్తే కలెక్షన్స్ లో ఇంప్రూవ్ మెంట్ కనపడి బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులేసే అవకాశం ఉంది.

గతంలో అ ఆ సినిమా సమయంలో సక్సెస్ మీట్లో త్రివిక్రమ్ స్పీచ్ చేసిన మ్యాజిక్ లాంటిది ఈ సినిమా విషయంలో కూడ జరిగితే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి, పవర్ స్టార్ క్రేజ్ ఒక్కటే హోప్ గా కనిపిస్తున్న నేపథ్యంలో బ్రో సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు