Peddakapu: శ్రీకాంత్ అడ్డాల గట్స్ కి హ్యాట్సాఫ్..!

శ్రీకాంత్ అడ్డాల పేరు వినగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో వంటి క్లాస్ టచ్ ఉన్న సినిమాలు గుర్తుకు వస్తాయి. ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన అడ్డాల ఇప్పుడు ట్రాక్ మార్చి ఔట్ అండ్ ఔట్ మాస్ యాంగిల్ లో పెదకాపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నిజానికి వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాతోనే తనలోని మాస్ యాంగిల్ ని బయటపెట్టాడు రేలంగి మామయ్య. అయితే, నారప్ప సినిమా ఓటీటీ రిలీజ్ కావడం, రీమేక్ కావడంతో పూర్తి క్రెడిట్ దక్కలేదు. ఇప్పుడు పెదకాపు సినిమా ద్వారా మరోసారి ఫుల్ లెంత్ మాస్ అండ్ యాక్షన్ జానర్ తో వస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన పెదకాపు సినిమా గ్లిమ్ప్స్ ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పెదకాపు సినిమాలో డెబ్యూ హీరో కావటం, బడ్జెట్ కూడా సుమారు 45కోట్ల మేర ఉంటుందని టాక్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక డెబ్యూ హీరో మీద ఈ రేంజ్ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేయటం రిస్క్ అని చర్చ జరుగుతోంది.

ఇప్పటిదాకా గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్ లో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన అడ్డాల, అదే బ్యాక్డ్రాప్ లో ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా కోసం కూడా అదే బ్యాక్డ్రాప్ ని ఎంచుకోవటం ఆసక్తికరంగా మారింది. అంతే కాకుండా ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించటం కొసమెరుపు. మొత్తానికి తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న రిస్క్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు