Chiranjeevi : చిరుకి ఇష్టమైన పవన్ సినిమాలు ఏంటో తెలుసా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తెలుగు ప్రజలంతా ఈ గర్వకారణమైన క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఈ ఏడాది జనవరి 25 నుంచే వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు తెలుగు వారంతా ఎప్పటికీ మరిచిపోలేను ఆ చీరస్మరణీయమైన క్షణం మే 9 న వచ్చేసింది. పద్మ విభూషణ్ అవార్డును అందుకోవడం కోసం చిరు తన ప్రైవేట్ జెట్ లో ఢిల్లీకి ప్రయాణం అయ్యారు. సాయంత్రం అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అవార్డును అందుకున్న అనంతరం ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇంటర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టిన చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా పవన్ నటించిన సినిమాల్లో ఇష్టమైన సినిమాలు ఏంటి? అనే విషయం మీద చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో చిరంజీవికి ఇష్టమైన సినిమాలు ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

పవన్ సినిమాల్లో చిరు ఫేవరెట్ మూవీ ఇదే..

చిరంజీవి తాజాగా కిషన్ రెడ్డి ముందు పవన్ కళ్యాణ్ సినిమాల్లో తనకు ఇష్టమైన సినిమాల లిస్ట్ ను బయట పెట్టారు. పవన్ మూవీస్ లో తొలిప్రేమ, బద్రి, జల్సా సినిమాలంటే తనకు బాగా ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇక అన్నింటిలోకెల్లా అత్తారింటికి దారేది మూవీ అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు చిరంజీవి. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అందులో ఒకటి రెండు తప్ప మిగతా అన్ని అద్భుతంగా ఉంటాయని అన్నారాయన.

- Advertisement -

చెర్రీ సినిమాల్లో చిరుకు నచ్చిన మూవీ..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో పాటు తన వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఏ మూవీ ఇష్టం అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు చిరు. రామ్ చరణ్ సినిమాల్లో రెండో సినిమా మగధీర న భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది అంటూ పొంగిపోయారు చిరు. దీంతో వెంటనే కిషన్ రెడ్డి అందుకొని అప్పట్లో అసెంబ్లీలో ఈ విషయం గురించి తనతో చిరు చెప్పినట్టు వెల్లడించారు. మగధీర మూవీ అద్భుతంగా వచ్చింది అంటూ అప్పట్లో తనతో చెప్పి రాంచరణ్ విషయంలో చిరు పొంగిపోయారు అన్న విషయాన్ని మళ్లీ చిరుకు గుర్తు చేశారాయన. అలా మెగాస్టార్ చిరంజీవి, కిషన్ రెడ్డి మధ్య అప్పటి రాజకీయాల నుంచి ఇప్పటి సినిమాల దాకా చర్చ నడిచింది.

అలాగే కిషన్ రెడ్డి రాజకీయ వారసులు ఎవరు అంటూ చిరు ప్రశ్నించగా, ఇప్పటిదాకా తనైతే ఎవ్వరిని తయారు చేయలేదని, భవిష్యత్ తరాలలో ఎవరైనా రాజకీయాల్లోకి వస్తామంటే వాళ్ళ ఇష్టం అని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. మొత్తానికి వీళ్లిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు