Ashu Reddy: పేరు మార్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. అసలేమైందంటే.?

Ashu Reddy.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ లాంటి సెన్సేషన్ డైరెక్టర్ తో ఇంటర్వ్యూ చేసి ఒక్క నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది అషు రెడ్డి.. ఆ తర్వాత పలు ఈవెంట్లు, షోలు చేస్తూ తెగ సందడి చేస్తోంది.. ఇదిలా ఉండగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒక రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళను కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ .. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ హౌస్ లో కూడా అడుగుపెట్టి.. అక్కడ తన అందంతో అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ కంటే ముందు కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో మెరిసిన ఈ అమ్మడు… ఇప్పుడు గ్లామర్ తో ఆకట్టుకోవడమే పనిగా పెట్టుకుంది. టిక్ టాక్ వీడియోలు చేస్తూ మొదట్లో అందరిని ఆకట్టుకున్న ఈ వయ్యారి.. అప్పట్లో జూనియర్ సమంత అని కూడా పిలిపించుకుంది.. కానీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక బిగ్ బాస్ తర్వాత అయినా సినిమాలలో బిజీ అవుతుంది అనుకుంటే అది కూడా జరగలేదు దాంతో సోషల్ మీడియాకే పరిమితమైంది..

Ashu Reddy: Bigg Boss beauty who has changed her name.. What is the original?
Ashu Reddy: Bigg Boss beauty who has changed her name.. What is the original?

హీరోయిన్ గా అవకాశం..

ఇక ఎలాగైనా సరే ఒక సినిమాలో నటించాలని..ఎన్నో కలలు కంది.. అయితే ఆ కలలు కలగానే మిగిలిపోయాయి.. అయితే తాజాగా ఆ కల నెరవేరబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇటీవలే అషురెడ్డి ఒక సినిమా చేస్తున్నాను అంటూ ప్రకటించింది.. నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ ఒక పోస్టర్ ను కూడా షేర్ చేసింది..అంతేకాదు ఈ సినిమాలో ఈమె గ్లామరస్ పాత్రలో కనిపించనుంది అని సమాచారం..

పేరు మార్చుకున్న అషు రెడ్డి..

ఇకపోతే తాజాగా అషు రెడ్డి తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించిన ఈమె.. ఇప్పుడు అదృష్టం కోసం పేరు కూడా మార్చుకుంది.న్యూమరాలజీ ప్రకారం తన పేరులో ఒక లెటర్ ను యాడ్ చేసుకుంది. తన పేరు స్పెల్లింగ్ లో మరో A అనే లెటర్ ను యాడ్ చేసింది ఈ బ్యూటీ.. దాంతో అషు రెడ్డి (Ashu Reddy) కాస్తా ఆషు రెడ్డి ( Aashu Reddy) అయిపోయింది. ఇకపోతే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ లో ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా సరే అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదు.. అందుకే ఇలా న్యూమరాలజీ పైన ఆధారపడినట్లు తెలుస్తోంది.. ఇక కెరియర్ బాగుండాలని గతంలో వేణు స్వామితో పూజలు చేయించుకుంది. ఇప్పుడు తన పేరును కూడా మార్చుకుంది…మరి ఇప్పటికైనా ఈమెకు అదృష్టం కలిసి వస్తుందా? లేక ఎప్పటిలాగే అందాల ఆరబోతతో యువతను మెప్పిస్తుందా అన్నది చూడాలి..

- Advertisement -

రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం..

ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలతో యువతకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇదిలా ఉండగా ఈమె వ్యక్తిగత విషయాలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమలో ఉందనే వార్తలు కూడా వినిపించాయి.. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి.. కానీ ఏమైందో తెలియదు కానీ ఎవరికి వారు సైలెంట్ అయిపోవడంతో ఈ రూమర్స్ కి కాస్త బ్రేక్ పడిందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు