OG: డిసెంబర్లో టఫ్ ఫైట్ – ఓజి కి ఎదురెళ్తారా, తప్పుకుంటారా…?

ఈ ఏడాది సమ్మర్ లో ఒకటి, రెండు చిన్న సినిమాలు మినహా పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయిన టాలీవుడ్ ఇప్పుడు డిసెంబర్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. డిసెంబర్లో వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి, ఇప్పటికే శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకటేష్ నటించిన సైన్ధవ్, నాని మృణాల్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా డిసెంబర్లో రిలీజ్ అనౌన్స్ చేయగా, ఇటీవలే వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ హీరోగా వస్తున్న ఎక్సట్రార్డనిరి మ్యాన్ సినిమా కూడా డిసెంబర్లో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. అంతే కాకుండా విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా డిసెంబర్లోనే రానుంది.

ఇదిలా ఉండగా పవర్ పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్లో నటిస్తున్న ఓజి సినిమా కూడా డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ అవ్వటం ఖాయం అని అనిపిస్తోంది. మరి ఓజి లాంటి సినిమా రిలీజ్ ఉన్న సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేసి వెంకటేష్, నాని, విశ్వక్ సేన్, నితిన్ రిస్క్ చేస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ కి బ్రేక్ పడకుండా ఇతర ఆర్టిస్ట్స్ లకు సంబంధించిన సీన్స్ ని షూట్ చేశాడు సుజిత్. ఇప్పుడు ఆగస్టు ఫస్ట్ వీక్ లో పవన్ కళ్యాణ్  సంబంధించిన బ్యాలెన్స్ సీన్స్ ని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అన్ని సవ్యంగా సాగితే, అనుకున్న సమయానికి ఓజి సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు