NBK’s Bhagavant Kesari: పల్సర్ బైక్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

NBK’s Bhagavant Kesari

శ్రీలీల డ్యాన్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధమాకా సినిమాలో పల్సర్ బైక్ సాంగ్ లో శ్రీలీల స్టెప్స్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ సాంగ్ సినిమాకే హైలైట్ అయ్యిందని చెప్పవచ్చు. మరోసారి అలాంటి సాంగ్ లో శ్రీలీల స్టెప్స్ వేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అనీల్ రావిపూడి డైరెక్షన్లో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ చెల్లెలి క్యారెక్టర్లో నటిస్తున్న శ్రీలీల కోసం దర్శకుడు అనీల్ రావిపూడి ఒక మాస్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సాంగ్ లో బాలకృష్ణ, కాజల్ తో కలిసి శ్రీలీల కూడా డ్యాన్స్ చేయనుందని అంటున్నారు.

సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వార్త సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ఏడాది సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ అందుకున్న నేపథ్యంలో దసరాకి కూడా మరొక బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి, మాస్ సినిమాలకి పెట్టింది పేరైన బాలకృష్ణల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. ఈ మధ్య కాలంలో వస్తున్న ప్రతి సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్న బాలకృష్ణ ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి ;బాలకృష్ణని ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు