Devara: తారక్ ” దేవర ” సాంగ్ ని అక్కడ అనౌన్స్ చేసిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్..!

Devara: త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో తారక్ కి జోడిగా జాన్వీ క‌పూర్ నటిస్తుంది.

Music sensation Anirudh announced Tarak's "Devara" song there
Music sensation Anirudh announced Tarak’s “Devara” song there

ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్న రాత్రి అవైటెడ్ ఫస్ట్ సింగిల్ అతి త్వరలో వస్తున్నట్లుగా ప్రచారం చేశారు. అయితే ఈ మొదటి పాట పై ఇంత తొందరగా అప్డేట్ రావడానికి కారణం సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అయినట్లు తెలుస్తుంది. తాను లేటెస్ట్ గా ఆస్ట్రేలియాలో ఇచ్చిన భారీ షో లో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

నేను ఒక న్యూస్ చెప్పబోతున్నాను అంటూ త్వరలోనే దేవరాజ్ సాంగ్ రాబోతుంది అంటూ ప్రకటించాడు అనిరుద్. దానితో అక్కడ ఈ అప్డేట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు అభిమానులు అయితే ఈ క్రేజీ కాంబినేషన్లో మొదటి సాంగ్ ని వినేందుకు చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారు. ఈ భారీ చిత్రం పాన్ ఇండియా భాషల్లో అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ మూవీపై ఇటు తారక్ అభిమానులతో పాటు అటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి హైప్ క్రియేట్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు