Heroine Love Affairs : లవ్, డేటింగ్ అంటూ ఇద్దరు స్టార్స్ మధ్య చిచ్చు పెట్టి మూడో నటుడిని పెళ్ళాడి సెటిల్ అయిన హీరోయిన్….

Heroine Love Affairs : సినిమా ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీ ఎవరితో ఎప్పుడు లవ్ లో పడతారు అన్న విషయం చెప్పడం చాలా కష్టం. ఇక వాళ్ళ బ్రేకప్ సంగతి కనీసం ఊహించలేం. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా లవ్, డేటింగ్ అంటూ ఇద్దరు స్టార్స్ మధ్య చిచ్చు పెట్టింది. ఆ తర్వాత ఏకంగా వాళ్ళిద్దరినీ పక్కన పెట్టేసి మరో నటుడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. మరి ఆ హీరోయిన్ ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

డస్కీ బ్యూటీ బిపాసా బసు ప్రస్తుతం ఫ్యామిలీతో సరదాగా గడుపుతోంది. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి తన బేబీతో టైం స్పెండ్ చేస్తుంది. ఇప్పుడంటే ఇంత సైలెంట్ గా ఉంది కానీ ఒకప్పుడు ఈ బ్యూటీ అంత మోస్ట్ వైలెంట్ పర్సన్ లేరంటే అతిశయోక్తి కాదు. వైలెంట్ అంటే అప్పట్లో ఆమె రొమాన్స్ విషయంలో వచ్చిన రూమర్స్ అంత క్రేజీగా ఉండేవి అన్నమాట. అప్పట్లో ఈ బ్యూటీ తన అందచందాలతో హిందీ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది. అలాగే పలువురు హీరోలు తన గురించి కొట్టుకునేదాకా తీసుకొచ్చింది. అప్పట్లో ఆ రచ్చ గురించి ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే ఆ విషయం గురించి తాజాగా క్లారిటీ వచ్చింది.

కెరీర్ మొదట్లో బిపాసా నటుడు, మోడల్, నిర్మాత అయిన డినో మోరియాతో ప్రేమాయణం నడిపించింది. ఇద్దరూ కలిసి పబ్లిక్ గానే చట్టాపట్టాలేసుకొని తిరిగారు. అలాగే ఇద్దరూ కలిసి ఉన్న రొమాంటిక్ ఫోటోలను కూడా వదిలారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకుంటుండగా సడన్ గా ఆయనకు బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంతో డేటింగ్ చేసింది. చాలా రోజులు వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. దీంతో ఇదంతా తెలిసిన జాన్, డినో ఇద్దరూ శత్రువులుగా మారారని, ఆమె కోసం ఇద్దరూ కొట్టుకున్నారని మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

- Advertisement -

కానీ తాజాగా ఈ రూమర్ పై స్పందించిన డినో అదంతా ట్రాష్ అంటూ కొట్టి పారేశాడు. తను జాన్ తో అప్పట్లో ఫ్రెండ్లీగా ఉండేవాడిని అని, మీడియానే ఇదంతా ప్రచారం చేసిందని డినో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాము అప్పుడే కాదు ఎప్పటికీ మంచి స్నేహితులం అంటూ తాజాగా వెల్లడించాడు. కానీ చివరికి బిపాసా ఇద్దరినీ కాకుండా మరో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన బిపాసా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఇప్పుడు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బిడ్డకు జన్మనిచ్చి , ఫ్యామిలీకే ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఇక రీసెంట్ గా తన పాపకు హార్ట్ లో హోల్ ఉందంటూ విలవిల్లాడిపోయింది. మొత్తానికి ఇన్నేళ్ల తర్వాత బిపాసా లవ్ ఎఫైర్స్ గురించి అప్పట్లో చెలరేగిన దుమారంపై ఓ క్లారిటీ వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు