Pawan Kalyan’s BRO: అంబటి కి భయపడ్డారా ‘బ్రో’..!

Pawan Kalyan’s BRO

బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సెటైరికల్ గా కమెడియన్ పృథ్వి రాజ్ తో స్పూఫ్ చేయించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈ స్పూఫ్ కి రెస్పాండ్ అయిన మంత్రి అంబటి పవన్ ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో కాస్త ఘాటుగానే స్పందించాడు. తాజాగా ఈ వివాదంపై మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ స్పందించాడు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్, అంబటి డ్యాన్స్ స్పూఫ్ పై యాంకర్ అడిగిన స్పందించిన తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పృథ్వితో చేయించిన స్టెప్స్ అంబటిని ఉద్దేశించి కాదని, రెండిటికీ సంబంధం లేదన్న తేజ్ నిజానికి అంబటి రాంబాబు గారు డ్యాన్స్ చాలా బాగా చేశారని కితాబిచ్చాడు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నిజానికి ఆ స్పూఫ్ అంబటిని ఉద్దేశించి చేసినదే అని క్లియర్ గా తెలుస్తున్నప్పటికీ తేజ్ ఇలా కవర్ చేయటంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. యాంటీ ఫ్యాన్స్ తేజ్ భయపడ్డాడని కామెంట్ చేస్తున్న క్రమంలో నెట్టింట ఇరువర్గాల మధ్య ట్వీట్ల వార్ జరుగుతోంది. ధైర్యంగా ఆన్సర్ చేయలేనప్పుడు ఇలాంటి స్పూఫ్స్ సినిమాల్లో పెట్టడం ఎందుకు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి.

- Advertisement -

మొత్తానికి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల సమయంలో జరిగిన రచ్చ రిపీట్ కాకూడదంటూ సినిమా యూనిట్ జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కారణంగానే ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచకుండా నార్మల్ రేట్స్ తోనే రిలీజ్ చేశారు. ఒక వైపు భారీ వర్షాలు, మరోవైపు నార్మల్ టికెట్ రేట్స్ కి తోడు సినిమాకి ఆశించిన హైప్ లేని కారణంగా ఓపెనింగ్స్ కూడా పవర్ స్టార్ సినిమాకి రావాల్సిన రేంజ్ లో రాలేదని టాక్ వినిపిస్తోంది. మరి, ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి బ్రో ఏ రేంజ్ లో వసూళ్లు రాబడుతుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు