Prabhas – Anushka Combination: ప్రభాస్ – అనుష్క హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా..?

Prabhas – Anushka Combination

సినిమాల్లో హీరో, హీరోయిన్ పెయిర్ నచ్చిందంటే చాలు అభిమానులు ఆ జంటను ఓన్ చేసుకుంటారు. ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోయినా అన్న, వదిన అంటూ వరుసలు కలిపి పిలుచుకుంటారు. టాలీవుడ్లో అలంటి జంటల్లో ముందు వరుసలో ఉంటుంది మోస్ట్ సక్సెస్ ఫుల్ పెయిర్ అయిన ప్రభాస్ అనుష్కల జంట. చాలా కాలం వరకు టాలీవుడ్ ఫెవరెట్ పెయిర్ గా కొనసాగిన ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై కలిసి కనిపించి చాలా కాలం అవుతోంది.

ఈ పెయిర్ కలిసి నటించిన బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగగా, అనుష్క సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ లేడి ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాల్లో నటించిన అనుష్క, ప్రభాస్ కి మంచి జోడీగా గుర్తింపు పొందింది. అప్పట్లో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రూమర్స్ వచ్చాయి.

పెళ్లి విషయంలో వచ్చిన రూమర్స్ ని పలు సందర్భాల్లో ఇద్దరూ ఖండించినా కూడా ఇప్పటికీ ఇద్దరూ సింగిల్ గానే ఉండటం అనుమానాలకు దారి తీస్తోంది. ఇదిలా ఉండగా, ఈ క్రేజీ కాంబో మళ్ళీ రిపీట్ అవబోతోంది అంటూ ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో  హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న క్రిష్ ప్రభాస్ కి ఓ కథ వినిపించారని, ఆ కథకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతోంది.నిర్మాతలు శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాకి హీరోయిన్ గా అనుష్క పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు.

- Advertisement -

అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే ప్రభాస్, అనుష్కల క్రేజీ పెయిర్ రొమాన్స్ వెండితెర మీద ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా పీరియాడిక్ జానర్లో ఉంటుందని వస్తున్న వార్తలపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకూ వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ‘ఆదిపురుష్’, ‘సాలార్’ ,’కల్కి’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఉండగా, అనుష్క కొంత గ్యాప్ తర్వాత  ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ క్రేజీ పెయిర్ రొమాన్స్ చూడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు