Vijay’s Leo: సౌత్ లో పెరుగుతున్న సంజయ్ దత్ క్రేజ్..!

Vijay’s Leo

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కేజిఎఫ్ లో విలన్ క్యారెక్టర్ చేసి సౌత్ ఆడియెన్స్ ని మెప్పించిన సంజయ్ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్, లియో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలకు సంబంధించి సంజయ్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ సినిమా యూనిట్స్. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బిగ్ బుల్ గా విలన్ రోల్ లో నటిస్తున్న సంజయ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా లియో ఆంటోని దాస్ గా కనిపించిన గ్లిమ్ప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది.  రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో సంజయ్ కి కెజిఎఫ్ ద్వారా వచ్చిన క్రేజ్ సినిమాలకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావటంతో ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. మరో పక్క హీరో రామ్ కి కూడా ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేని నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ కి ఆ రేంజ్ లో హిట్ లేనందున ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి.

ఇక లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో సినిమా మీద మొదటి నుండి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న మూడో సినిమా కావటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వైట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరి, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో హ్యాట్రిక్ హిట్ అవుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు