Most Wanted Lady Sri Leela: మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల..!

Most Wanted Lady Sri Leela

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీ లీల వరుసగా సినిమాలు చేస్తూ స్పీడ్ మీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అరడజనుకి పైగా సినిమాలను లైన్లో పెట్టిన ఈ కన్నడ భామ మరో క్రేజీ సినిమా అఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో శ్రీ లీలను హీరోయిన్ గా అనుకుంటున్నట్లు డైరెక్టర్ బుచ్చిబాబు హింట్ ఇచ్చాడు.

స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయిన బుచ్చిబాబు స్పీచ్ ఇస్తూ తన సినిమాల్లో హీరోయిన్ గా తెలుగు అమ్మాయిలను తీసుకోవటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని, ఉప్పెన సినిమా సమయంలో ఎంత ట్రై చేసినా కుదరకపోవడం వల్ల కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని అన్నారు.

రామ్ చరణ్ తో చేయబోయే సినిమా విషయంలో కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయ్యానని చెప్పిన బుచ్చిబాబు శ్రీ లీల ప్రస్తావన తీసుకొస్తూ ‘ఈ అమ్మాయి బాగుంది’ అంటూ కితాబిచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీ లీల, బుచ్చిబాబు ఇచ్చిన కాంప్లిమెంట్ కి మురిసిపోయింది.

- Advertisement -

బుచ్చిబాబు కామెంట్స్ కి శ్రీ లీల ఇచ్చిన రియాక్షన్ ని లింక్ చేస్తూ RC 16 మూవీలో హీరోయిన్ శ్రీలీల అంటూ నెటిజన్లు ఫిక్స్ అవుతున్నారు. బుచ్చిబాబు కామెంట్స్ వెనుక ఇంటెన్షన్ ఏంటో తెలీదు కానీ, రామ్ చరణ్ సినిమాలో గనక శ్రీలీల హీరోయిన్ గా చేస్తే సినిమాకి మరింత స్పైస్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ వీలైనంత త్వరగా బుచ్చిబాబు సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యిందని టాక్ వినిపిస్తుండగా ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని అంటున్నారు. దీనికి తోడు రామ్ చరణ్ ఈ సినిమాలో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ గా కనిపిస్తాడని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అని ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అవ్వగా హీరోయిన్ శ్రీలీల అంటూ వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు