Businessman: నైజాంలో మహేష్ ఆల్ టైం రికార్డు సెట్టు!

Businessman all time record in Nizam

టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. లాస్ట్ ఇయర్ పోకిరి నుండి ఎక్కువైన ఈ హంగామా చిన్న సినిమాలకి కూడా ఎగబాకింది. ఈ రీ రిలేస్ సినిమాల్లో ప్లాప్ అయిన సినిమా రీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయితే ఆశ్చర్యపోయారు. తాజాగా ఒక డబ్బింగ్ సినిమా కూడా తెలుగు సినిమాల రేంజ్ లో భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్ టైం కలెక్షన్లు సాధించిన సినిమాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “ఖుషి” సినిమాకే దక్కింది. దాదాపు 7.46 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రీ రిలీజ్ లోను ట్రెండ్ సెట్ చేసింది.

అయితే ఇప్పుడు ఆ రికార్డులన్నిటికి చెక్ పెట్టేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ ఆయన బర్త్ డే కానుకగా ఆగష్టు 9న రిలీజ్ అయింది. రిలీజ్ కి ముందే బుకింగ్స్ తో భీభత్సం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు నైజాం లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. బిజినెస్ మ్యాన్ రిలీజ్ రోజు నైజాం లో 2.46 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దుమ్ము లేపింది. ఇంతకు ముందు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఖుషి(1.65CR) ని దాదాపు 80 లక్షల భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి మహేష్ స్టామినా చూపించింది.

అయితే వరల్డ్ వైడ్ లెక్కలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. కానీ ఫస్ట్ డే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ కొట్టాయన్న టాక్ వినబడుతుంది. ఫస్ట్ డే బిజినెస్ మ్యాన్ వరల్డ్ వైడ్ గా 5.20 నుండి 6కోట్ల వరకు ఓపెనింగ్స్ కొల్లగొట్టిందని సమాచారం. మరి అఫిషియల్ గా వచ్చే వరకు చూడాలి లెక్క ఎంత ఉంటుందో.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు