Sidhu jonnalagadda new movie launch : టిల్లు గాని కొత్త సినిమా షురూ

sidhu jonnalagadda new movie launch

సిద్దు జొన్నలగడ్డ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం అయింది. ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమా అఫీషియల్ గా కాసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైంది.

బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటు, దుసుకుపోతున్న సిద్దు జొన్నగడ్డ కు ఇటువంటి సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా ఒకే అవడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి.

ప్రేమకథ చిత్రాలను తనదైన స్టైల్ లో ప్రేక్షకులందరిని ఆకట్టుకునే విధంగా తీయడంలో బొమ్మరిల్లు భాస్కర్ దిట్ట. ఇటీవలనే ఆయన అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు.ఇక డీజే టిల్లు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ కెరీర్ కు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా చాలా వరకు ప్లస్ అవుతుండటంతో ఏమాత్రం సందేహం లేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో శ్రీలీల ను హీరోయిన్ తీసుకోబోతున్నారని టాక్.

- Advertisement -

దిల్ రాజు, అల్లు అరవింద్,కార్తీక్ దండు ఈ సినిమా ఓపెనింగ్ కు హాజరయ్యారు. ప్రొడ్యూసర్ దిల్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ప్రస్తుతం సిద్దు నటిస్తున్న టిల్లు స్క్వేర్  సినిమా అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో కూడా సిద్దు ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్. ఈ సినిమా కూడా త్వరలోనే అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు