Siddu jonnalagadda latest movie buzz: ఆ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న డీజే టిల్లు

Siddu jonnalagadda latest movie bazz

డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరిని డామినేట్ చేస్తూ వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు.

ప్రస్తుతం డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్న సిద్దు జొన్నగడ్డ ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ యంగ్ హీరో చేతిలో టిల్లు స్క్వేర్ సినిమాతోపాటు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలే కాకండా మెగా స్టార్ చిరంజీవితో కలిసి బ్రో డాడీ రీమేక్ సినిమాలో నటించబోతున్నట్టు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

కాగా లేటెస్ట్ గా సిద్దు జొన్నలగడ్డ ఒక క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఆ క్రేజీ డైరెక్టర్ మరెవరో కాదు బొమ్మరిల్లు భాస్కర్. లవ్ స్టోరీ సినిమాలకు కేరాఫ్ గా మంచి గుర్తిపు పొందిన బొమ్మరిల్లు భాస్కర్, ఇటీవలనే అఖిల్ అక్కినేని తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.

- Advertisement -

అయితే లేటెస్ట్ గా ఈ డైరెక్టర్, సిద్దుజొన్నగడ్డను కలిసి కథ వినిపించడట. సిద్దు కు కూడా స్టోరీ బాగా నచ్చడంతో ఈ సినిమా లాక్ అయినట్టు సమాచారం అందుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన ఆరేంజ్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించిన సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడే అదే డైరెక్టర్ తో కలిసి హీరోగా సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. ఆగస్ట్ 10న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు