Rajinikanth: “జైలర్” తెలుగు బిజినెస్.. క్లిక్కయితే బయ్యర్లకి పండగే?

Rajinikanth Jailer Telugu Business

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ “జైలర్” కూడా ఒకటి. ఆగష్టు 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు బిజినెస్ లెక్కలు తాజాగా బయటికి వచ్చాయి. అయితే గత కొన్నాళ్లుగా రజినీకాంత్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు అని తెలిసిందే. చివరగా వచ్చిన పెద్దన్న కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సారి మేకర్స్ సేఫ్ బిజినెస్ చేశారు.

జైలర్ కి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ రేట్లకి విక్రయించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మొత్తంగా 12కోట్ల బిజినెస్ జరిగింది. ఇది తన గత చిత్రమైన పెద్దన్న తో సమానమే అయినప్పటికీ, రజినీకాంత్ కబాలి, 2.0 లాంటి సినిమాల కన్నా చాలా తక్కువ. కానీ ఈ సినిమాకి ఎక్కువ హైప్ ఉండడంతో ట్రేడ్ పండితులు 30కోట్ల వరకు తెలుగు బిజినెస్ జరగొచ్చని అనుకున్నారు. అయితే ప్రొడ్యూసర్లు అలా చేయలేదు. రజిని ఉన్న సిట్యుయేషన్ ని బేస్ చేసుకొని అన్ని చోట్లా రీసనబుల్ రేట్లకే విక్రయించడం జరిగింది.

అలాగే తెలుగు వెర్షన్ కి తక్కువ బిజినెస్ చేసారు. అయితే జైలర్ కి అవుతున్న బుకింగ్స్ ని బట్టి టాక్ ఎలా ఉన్నా కేవలం మూడు రోజుల్లోపే తెలుగులో బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరిగితే బయ్యర్లకి ఇకముందొచ్చేది అంతా ప్రాఫిట్టే. ఇక వరల్డ్ వైడ్ గా జైలర్ కి 122 కోట్ల బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 230కోట్ల వరకు గ్రాస్ రాబట్టాలి. అయితే ఫస్ట్ డే నే 80 నుండి 100కోట్లు రావొచ్చని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మరి చూడాలి జైలర్ తెలుగులో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు