Boxoffice: జైలర్ తో రజిని ఆల్ టైం రికార్డు కొడతాడా?

Will Rajini create all-time record with Jailer?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ ఒక్కోసారి ఇక్కడ స్టార్ హీరోల రేంజ్ లో రజినీకాంత్ సినిమాలకు ఓపెనింగ్స్ రావడం జరుగుతుంటుంది. అయితే గత కొన్నేళ్లుగా రజినికాంత్ నుండి సరైన సినిమా రావడం లేదు. ఈ హీరో నటించిన పేట, 2.0 తెలుగులో యావరేజ్ గా ఆడగా, చివరగా వచ్చిన పెద్దన్న దారుణంగా ప్లాప్ అయింది. అయితే ఇన్ని ప్లాపులు వచ్చినప్పటికీ రజినీకాంత్ కి తమిళ్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అలాంటి క్రేజె ఉంది.

దానికి సరైన ఉదాహరణ ఇప్పుడు జైలర్ కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్. మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకి ధీటుగా జైలర్ కి బుకింగ్స్ జరుగుతుండడం విశేషం. అయితే రజినీకాంత్ జైలర్ సినిమాతో ఈ సారి ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ సాధిస్తాడని అంటున్నారు నెటిజన్లు. రజినీకాంత్ గత చిత్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం 2.0. రోబో కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 12.5కోట్లు వసూలు చేసింది. ఇక ఆ తరువాత స్థానంలో కబాలి 93 కోట్లు రాబట్టింది.

అయితే రీసెంట్ గా వచ్చిన రజిని సినిమాలేవీ ఈ స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడొస్తున్న జైలర్ కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మరో సారి రజినీకాంత్ తెలుగులో కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం జైలర్ కి 10 నుండి 13 కోట్ల వరకు తెలుగుస్టేట్స్ లో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల వరకు ఓపెనింగ్స్ కొల్లగొట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు