Sri simha: ఉస్తాద్ కి థియేటర్ల సమస్యా?

Theaters problem for Ustad?

టాలీవుడ్ లో ఆగష్టు రెండో వారంలోఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ అయితే, మరొకటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్. ఇక జైలర్ ఆగష్టు10న వస్తుంటే, భోళా శంకర్ ఆగష్టు11 న రిలీజ్ కాబోతుంది. అయితే వీళ్లిద్దరి మధ్యలో పోటీకి సై అంటున్నాడు “ఉస్తాద్”.

శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన ఉస్తాద్ సినిమా కూడా ఈ వారంలో రిలీజ్ అవుతుంది. అయితే ఈ విషయం చాలా మంది ఆడియన్స్ కి తెలియదు కూడా. ఉస్తాద్ సినిమా ఆగష్టు12 న రిలీజ్ కి రెడీ అవుతుంది. అంటే చిరంజీవి, రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే అన్నమాట. అయితే ఈ సినిమాలో కంటెంట్ బాగుందన్న నమ్మకమో, లేక మరేదైనా కారణమో తెలియదు కానీ, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు పోటీగా సినిమా రిలీజ్ చేయడం అంత కరెక్ట్ కాదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

అది తెలుస్తూనే ఉంది. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం లేదని టాక్ నడుస్తుంది. ఇప్పటికే సిటీ ఏరియాల్లో ఈ స్టార్ హీరోల సినిమాలకు బుకింగ్స్ ఓపెన్ అవగా, ఉస్తాద్ కి మాత్రం ఇంకా థియేటర్లే దొరకలేదు. ఆన్లైన్ లో కూడా బుకింగ్స్ చూపించడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 100లోపే ఇప్పటివరకు ఉస్తాద్ ప్రదర్శనకి థియేటర్లు దొరికాయని అంటున్నారు. అయితే ఉస్తాద్ పై ఉన్న బజ్ కి, పెట్టిన బడ్జెట్ కి లెక్క కుదరాలంటే కనీసం 300థియేటర్లయినా కావాలి. మరి రిలీజ్ డే వచ్చేసరికి ఎన్ని థియేటర్లు ఉస్తాద్ సంపాదిస్తాడో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు