Ntr’s devara movie latest update : షార్క్ తో తలపడనున్న టైగర్

Ntr’s devara movie latest update

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతోంది. గతకొద్ది రోజులుగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా గురించి రోజుకో వార్త ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుండగా, లేటెస్ట్ గా మరో రూమర్ వైరల్ గా మారింది.

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవరలో భారీ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కోసం ఆర్ఆర్ఆర్ తరహాలో భారీ ఫైట్ షూటింగ్ ను కంప్లిట్ చేసిన మూవీ టీం, సినిమాలో ఒక కీలకమైన సన్నివేశంలో వచ్చే మరో భారీ ఫైట్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారట .

అయితే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ ఏకంగా సముద్రంలో ఉండే షార్క్ చేపతో తలపడబోతున్నారని సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో ఒక ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా కోసం హాలీవుడ్ నుంచి కొంతమంది ప్రత్యేక టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఈ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారట.

- Advertisement -

అప్పుడెప్పుడో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాలో సొర చేప తో యాక్షన్ సీన్ వచ్చిందంటే మళ్ళీ ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ లలో ఆ రేంజ్ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ రాలేదు. అందుకే ఆ ఎక్స్ పిరియన్స్ ను మరోసారి ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెన్స్ ను ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య ముస్తాబవుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు