NTR’s Devara: ఆ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్న ఎన్టీఆర్…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న కొరటాల ఈ సినిమా ద్వారా ఎలా అయినా హిట్ అందుకొని తన సత్తా చాటాలన్న కసితో ఉన్నాడు. RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కాబట్టి దేవర కోసం అభిమానులతో సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిచగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు.

ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య  అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇందుకు సంబందించిన సెట్ వర్క్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోందట. ఈ సీక్వెన్స్ కోసం  ఎన్టీఆర్ డూప్ లేకుండా నటించనున్నారని సమాచారం. డూప్ తో షూట్ చేస్తే ఒరిజినాలిటీ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని ఎన్టీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అంతే కాకుండా యాక్షన్ కొరియోగ్రఫీ దగ్గర నుండి, వీఎఫెక్స్ వర్క్ వరకు ప్రతి విషయాన్నీ దగ్గరుండి తెలుసుకుంటూ, వీలైతే సలహాలు ఇస్తూ ఎన్టీఆర్ కేర్ తీసుకుంటున్నాడని సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా విషయంలో మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఈ సినిమాను కొరటాల రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడట. ఇదే గనక నిజం అయితే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పచ్చు.

- Advertisement -

హీరో విలన్ మధ్య జరిగే ఆ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా హిట్ అవ్వటం అటు కొరటాల, ఇటు ఎన్టీఆర్ కి కీలకం అని చెప్పాలి. టైటిల్ పోస్టర్ ద్వారా ఈ సినిమాలో వాయిలెన్స్ పీక్ లెవెల్లో ఉండనుందని సంకేతం ఇచ్చిన కొరటాల దేవర సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు