Ramcharan: దిల్ రాజు సినిమాల్లో ఈ సినిమాకే బిగ్గెస్ట్ బడ్జెట్!

“Game Changer” is the biggest budget movie in Dil Raju’s career.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ లో అనేక చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా మారాడు. అంతే కాదు తెలుగులో రూపొందే ఏ పెద్ద సినిమా హక్కులు అయినా దిల్ రాజు చెంతకే చేరుతుంది. అంత పెద్ద నిర్మతగా మారాడు. ఇక నైజాం లో సగం థియేటర్లు దిల్ రాజు చేతిలోనే ఉంటాయి.

అలాంటి ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు భారీ చిత్రాలు తీయడంలో ముందున్నా వాటికీ బడ్జెట్ కంట్రోల్ పెట్టడంలో కూడా సక్సెస్ అవుతాడు. చాలా ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ తో సినిమా తీయలేదు దిల్ రాజు. కానీ ఇప్పుడు శంకర్ తో తీస్తున్న “గేమ్ ఛేంజర్” మాత్రం తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నాడు. మామూలుగా దిల్ రాజు ఏ పెద్ద సినిమా అయినా హీరో రెమ్యూనరేషన్ తో కలిపి 80 కోట్లలోపే సినిమా తీస్తాడు. రీసెంట్ గా విజయ్ తో తీసిన వారిసు సినిమాకి రెమ్యూనరేషన్ తో కలిపి అయిన బడ్జెట్ 100కోట్ల లోపే. ఆ సినిమా క్వాలిటీ చూస్తే తెలిసిపోతుంది.

అయితే ఇప్పుడు తీస్తున్న గేమ్ ఛేంజర్ కి మాత్రం దిల్ రాజు ఏకంగా 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాటలకే 100కోట్ల దాకా ఖర్చు అవుతున్నట్టు తెలిసింది. శంకర్ సినిమా అంటే అది మామూలే. పాటలకే సగం బడ్జెట్ అవుతుంది అంటారు చాలా మంది. అయితే గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యేసరికి మరో 50కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అంటే 250 కోట్లు అన్నమాట.

- Advertisement -

అయితే దిల్ రాజు ఇందులో సగం బడ్జెట్ పెట్టి కూడా ఇంతకు ముందు ఎప్పుడూ సినిమా తియ్యలేదు. అలాంటిది దిల్ రాజు శంకర్ ని నమ్మి ఇంత బడ్జెట్ పెడుతున్నాడంటే సాహసమనే చెప్పాలి. అయితే పొరపాటున ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే దిల్ రాజు మరో సారి ఇలాంటి రిస్క్ చెయ్యడు. కానీ క్లిక్ అయితే మాత్రం దిల్ రాజుకి కాసుల పంట పండినట్టే అనాలి. ఎందుకంటే రాజమౌళి సినిమాలు ఎలాగో, శంకర్ సినిమా కూడా అలా ఉంటాయి. మరి గేమ్ ఛేంజర్ వచ్చే సరికి ఫైనల్ గా ఎంత ఖర్చు అవుతుందో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు