Chandramukhi2: ఈ బాలీవుడ్ “క్వీన్”.. వారిలా మెప్పించగలదా?

Can Kangana Ranaut impress like them?

కోలీవుడ్ లో రూపొందుతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “చంద్రముఖి2”. ఒకప్పటి సౌత్ బ్లాక్ బస్టర్ అయిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. చంద్రముఖి లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ లో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ తీసిన వాసు యే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ మిక్సడ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. అయితే లారెన్స్ కి వచ్చినంత నెగిటివ్ టాక్ ఈ హీరోయిన్ స్టిల్ కి రాలేదు. ఫస్ట్ లుక్ డీసెంట్ గా ఉండి ఆకట్టుకుంది. అయితే ఫస్ట్ లుక్ డిజైన్ ని బట్టి కంగనా చేస్తుంది చంద్రముఖి పాత్రే అని తెలుస్తుంది.

ఇక పార్ట్ 1 లో చంద్రముఖి పాత్ర చేసిన జ్యోతిక ఆ పాత్రలో ఎంత అద్భుతంగా నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీకాంత్ తో పోటీ పడి మరి సినిమా హిట్ కావడానికి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది ఆమె నటన. ఇక ఈ సినిమా ఇతర భాషల్లో కూడా నటించిన సౌందర్య, శోభన, విద్యా బాలన్ కూడా చాలా చక్కగా నటించారు. అయితే ఇప్పుడు వస్తున్న చంద్రముఖి లో జ్యోతిక లాగా కంగనా పెర్ఫార్మ్ చేయగలుగుతుందా అన్నదే ఆడియన్స్ ప్రశ్న. ఎందుకంటే సినిమాకి ఆ పాత్రే కదా కీలకం.

- Advertisement -

అయినా కంగనా పెర్ఫార్మన్స్ గురించి పేరు పెట్టలేం. ఇంతకు ముందు ఆమె నటించిన క్వీన్, ఫ్యాషన్, మణికర్ణిక లాంటి సినిమాల్లో తన నటనా ప్రతిభతో ఆడియన్స్ ని మెప్పించింది. అలాగే ఈ సినిమాలోనూ మెప్పిస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. కానీ డైరెక్టర్ మళ్ళీ చంద్రముఖి రేంజ్ లో తీయగలడా అనేది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు