Rajinikanth: “చంద్రముఖి” ముందు వచ్చింది ఏ భాషలో తెలుసా?

Do you know which language “Chandramukhi” came before?

సినీ ఇండస్ట్రీ లో రీమేక్ లు, సీక్వెల్స్ లు అనేవి కామన్. ప్రతి ఇండస్ట్రీలో కూడా జరుగుతుంటాయి. కానీ కొంతమంది మాత్రమే రీమేక్ లని మరిపించేలా సినిమాలు తీయగలరు. అసలు విషయానికొస్తే సౌత్ ఇండస్ట్రీలోనే ఆ రోజుల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “చంద్రముఖి” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో హీరోగా నటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ తన కామెడీ, యాక్షన్ లో కొత్తదనం చూపించారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు చంద్రముఖి2 వస్తుంది.

రాఘవ లారెన్స్ హీరోగా వస్తున్న ఆ సినిమాకు మొదటి పార్ట్ తీసిన పి. వాసుయే డైరెక్ట్ చేస్తున్నారు. అయితే చంద్రముఖి సినిమా స్ట్రెయిట్ రజినీకాంత్ సినిమా అని అందరు అనుకుంటారు. కానీ ఆ సినిమా ఇద్దరు సూపర్ స్టార్స్ నటించి సూపర్ హిట్ అయ్యాక దాన్ని రజినీకాంత్ రీమేక్ చేసారని తెలీదు. అవును.. చంద్రముఖి సినిమా రీమేక్.

ఈ సినిమా ఒరిజినల్ గా తీసింది మలయాళంలో, ఆ సినిమా వచ్చి కూడా ముప్పై ఏళ్లయింది. 1993లో “మణిచిత్రతాజు” పేరుతో రూపొందిన ఆ సినిమాను ఫాజిల్ డైరెక్ట్ చేయగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించారు. శోభన హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రాన్ని పదేళ్ల తర్వాత కన్నడలో విష్ణు వర్ధన్ హీరోగా రీమేక్ చేసారు. “ఆప్తమిత్ర” పేరుతో తీయగా ఆ చిత్రంలో కథానాయికగా సౌందర్య నటించారు. కన్నడలో కూడా బ్లాక్ బస్టర్ అయింది ఈ సినిమా.

- Advertisement -

దీని తర్వాతే రజినీకాంత్ హీరోగా చంద్రముఖి పేరుతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాలో జ్యోతిక, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఇక దీనికి సీక్వెల్ గా కన్నడలో “ఆప్తరక్షక” పేరుతో విష్ణు వర్ధన్ సినిమా తీయగా అక్కడ యావరేజ్ హిట్ అయింది. దాన్ని మళ్ళీ తెలుగులో వెంకటేష్ హీరోగా పి. వాసు నాగవల్లి పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ ప్లాప్ అయింది. అయితే ఇన్నాళ్లకు రాఘవ లారెన్స్ హీరోగా డైరెక్టర్ వాసు మళ్ళీ సీక్వెల్ పేరుతో చంద్రముఖి పార్ట్ తీస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు