NTR: దేవర – ఊర మాస్, నెవర్ బిఫోర్ ఫ్రమ్ కొరటాల..!

ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలలైంది. ముందుగా ప్రచారం జరిగినట్టే ఈ సినిమాకు ‘దేవర‘ అన్న టైటిల్ ని ఫిక్స్ చేసింది సినిమా యూనిట్. పోస్టర్లో ఎన్టీఆర్ మాస్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ సమయం నుండి చెప్తున్నట్టుగానే సముద్రం ఒడ్డున శవాల మధ్యలో నిలబడి ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఆచార్య సినిమాతో డిజాస్టర్ చవిచూసిన కొరటాల శివ, దేవర సినిమాతో గట్టి పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇవ్వటం ఖాయం అన్న నమ్మకం కలుగుతోంది. కొరటాల సినిమాలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఫస్ట్ లుక్ చూస్తుంటే.
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ ఫై నిర్మితమవుతున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం దేవర సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. వీటితో పాటుగా హ్రితిక్ రోషన్ తో కలిసి వార్ 2సినిమాలో కూడా ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో నటించనున్నాడు.
ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వటం కొరటాలకి చాలా కీలకం అని చెప్పాలి. జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇస్తుండటం పట్ల కూడా ఆడియెన్స్ లో ఆసక్తి నెలకొంది. మరి, ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న కొరటాల హిట్ అందుకుంటాడా లేదా వేచి చూడాలి.
For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు