Devara: ఎన్టీఆర్ కి పోటీగా బన్నీ..!

స్టార్ హీరోల సినిమాలు పోటాపోటీగా రిలీజ్ అయితే అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. ఇప్పుడంటే బిజినెస్ ఈక్వేషన్స్ కారణంగా ఈ పోటీ కాస్త తగ్గింది కానీ, అప్పట్లో బాలకృష్ణ,చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాలు చాలా సందర్భాల్లో పోటీగా రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలిజ్ అవ్వడం అన్నది చాలా రేర్ గా జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల సినిమాలు ఒకే నెలలో రానున్నాయి. కొరటాల డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా 2024 ఏప్రిల్ లో రిలిజ్ కానుండగా సుకుమార్ డైరెక్షన్లో బన్నీ నటిస్తున్న పుష్ప2 కూడా ఏప్రిల్ నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

నిజానికి పుష్ప షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ మినహా ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో బన్నీ ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురవుతున్నారు. మొదట డిసెంబర్ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది సాధ్యం అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఏప్రిల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

దేవర షూటింగ్ మాత్రం బ్రేక్ లేకుండా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కొరటాల అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీగా ప్లాన్ చేసాడని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తీరాలన్న కసితో కొరటాల దేవర సినిమాని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి, ఆచార్య తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కొరటాల దేవరతో బ్లాక్ బస్టర్లండుకుంటారా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు