Rocky Aur Rani Prem Ki Kahani: రొట్ట సినిమాతో రెండొందల కోట్లు కొట్టాడు.. ఎలా?

“Rocky Aur Rani Prem Ki Kahani” Collections

బాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా ప్రేక్షకులు మెచ్చే సినిమాలు రావడంలేదన్న సంగతి తెలిసిందే. అందుకని అక్కడి ప్రేక్షకుల దృష్టి సౌత్ ఇండస్ట్రీ లపై పడింది. ఫలితంగా మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే అది చిన్న, సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా హిట్ చేసే వాళ్ళు. సీతారామం, కార్తికేయ2, కాంతారా అలా ఆడినవే. అయితే బాలీవుడ్ ప్రముఖులు మాత్రం తమ ఇండస్ట్రీ పడి పోయే పరిస్థితిలో ఉన్నా, భారీగా ట్రోల్స్ వస్తున్నా కూడా అవేమి పట్టనట్టు రొటీన్ కంటెంట్ సినిమాలు తీస్తున్నారు.

ఆ మధ్య వచ్చిన పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అదొక రొటీన్ కంటెంట్ ఉన్న కమర్షియల్ మూవీ అని అందరికి తెలుసు. తాజాగా అంతకంటే నాసిరకం కంటెంట్ తో బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఒక సినిమా తీసాడు. అదే ఈ వారం రిలీజ్ అయిన సినిమా “రాకీ ఔర్ రాణి ప్రేమ్ కి కహాని”. కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా జులై28న రిలీజ్ అయి మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. లవ్& ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రణవీర్ సింగ్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమా కరణ్ జోహార్ తీసిన పాత సినిమాలు కభీ ఖుషి కభీ గమ్ లాగా, ఇంకా కొన్ని సినిమాల మిక్సింగ్ చేసి తీసినట్లు ఉందని రకరకాల ట్రోల్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ డే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో డిజాస్టర్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ బాలీవుడ్ మూవీ బ్లాక్ బస్టర్ వసూళ్లు అందుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు వచ్చాయి. “రాకీ ఔర్ రాణి ప్రేమ్ కి కహాని” సినిమాకి ఇప్పటివరకు ఇండియాలో 125కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా, ఒక్క ఓవర్సీస్ నుండి 85కోట్లు వచ్చాయి. టోటల్ గా 10రోజుల్లో ఈ సినిమా 210 కోట్లు వసూలు చేయడం విశేషం.

- Advertisement -

అయితే ఇలాంటి రొటీన్ కంటెంట్ ఉన్న సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో ఇప్పటికి అర్థం కావట్లేదంటున్నారు కొందరు సౌత్ ట్రేడ్ పండితులు. ఇలాంటి సినిమాల్ని ఆదరిస్తే కొత్త కాన్సెప్ట్ సినిమాలు బాలీవుడ్ లో ఎప్పుడొస్తాయని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు