Rocky Our Rani Ki Prem Kahani: మరోసారి ఆ హీరోతో జతకడుతున్న అలియా భట్

అలియా భట్. ఈ హీరోయిన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన లేదు. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా తన టాలెంట్ తో హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్ కూతురిగా బాలీవుడ్ లో 2012 లో స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ 2 స్టేట్స్, హంప్టీ శర్మ కి దుల్హనియా, వరుస హిట్ల తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక 2022 లో గంగూబాయి ఖతియా వాడి, RRR , బ్రహ్మాస్త్ర సినిమాలతో మూడు బ్లాక్ బస్టర్లు కొట్టిన ఈ భామ అదే ఏడాది బాలీవుడ్ స్టార్ అయిన రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే గాక, ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది.

కొన్నాళ్లపాటు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసిన అలియా భట్ తాజాగా మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పటికే హార్ట్ అఫ్ స్టోన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అలియా తాజాగా మరో ఆఫర్ ని దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు అయిన కరణ్ జోహార్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న “రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని” సినిమాలో అలియా భట్ హీరోయిన్ నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు.

అయితే రణవీర్ సింగ్ అలియా జంటగా ఇంతకు ముందు గల్లీ బాయ్ చిత్రంలో కలిసి నటించారు. 2019 లో వచ్చిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు 4ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ కాంబో లో సినిమా వస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా 2023 చివర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు