Bhola shankar : అధ్వానంగా భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్స్

Bhola shankar advance bookings

మెగా స్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రమైన భోళా శంకర్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు కొంచెం కూడా ఆసక్తి చూపించడం లేదని స్పష్టమవుతోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా, ఇటీవలనే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. మెగా స్టార్ సినిమా కదా..బుకింగ్స్ ఓపెన్ చేసిన కాసేపట్లోనే టికెట్స్ అన్నీ అమ్ముడైపోతాయనుకుంటే.. సిన్ రివర్స్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి రోజు బుకింగ్స్ కాస్త పరవాలేదనిపించినా గడిచిన 24 గంటల్లో మాత్రం భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్స్ మరీ అద్వానంగా పడిపోయాయి.

రజినీకాంత్ లేటెస్ట్ చిత్రమైన జైలర్ కంటే కూడా భోళా శంకర్ సినిమాకు అతి తక్కువగా బుకింగ్స్ జరుగుతున్నాయి. మెగా స్టార్ సినిమా అని తలచి కొంతమంది పలు చిన్న సినిమా నిర్మాతలు వారి, వారి సినిమాలను పోస్ట్ పోన్ కూడా చేసుకున్న కూడా ప్రయోజనం లేకుండా పోయింది

ఇప్పటికే ఏజెంట్ సినిమా ఫ్లాప్ తో భారీగా నష్టపోయిన అనిల్ సుంకర, భోళా శంకర్ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్షన్ కు దూరమైన మెహర్ రమేష్ కూడా భోళా శంకర్ సినిమాపై తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇక హీరోయిన్ తమన్నా కూడా తెలుగులో మరోసారి బిజీ హీరోయిన్ కావాలంటే భోళా శంకర్ సినిమానే కీలకం. కానీ సినిమా పరిస్థితి చూస్తే మాత్రం అందరు ఆశించిన విధంగా లేదని చెప్పాలి.

- Advertisement -

భోళా శంకర్ సినిమా బుకింగ్ ఓపెన్ చేసిన గత24 గంటల్లో కేవలం 13.66 వేల టికెట్స్ మాత్రమే బుక్ అయ్యాయి. కానీ జైలర్ సినిమాకు మాత్రం ఎవరు ఊహించని విధంగా 233.15వేల అమ్ముడై భోళా శంకర్ ను బీట్ చేసింది. మరీ భోళా శంకర్ రీమేక్ సినిమా అవడం కారణంగానో లేక మెగా స్టార్ సినిమాపై నిజంగానే ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిందో.. కారణమేంటో ?తెలియదు కానీ భోళా శంకర్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం నత్త నడకన సాగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటె రిలీజ్ తరువాత సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే అంతుచిక్కటం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు