BRO: హాలిడే అడ్వాంటేజ్ తో సాలిడ్ గ్రోత్ “బ్రో”..

Bro movie solid growth..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ “బ్రో” జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మిక్సడ్ రెస్పాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కి ముందు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇచ్చిన హై తో అడ్వాన్సు బుకింగ్స్ లతో రచ్చ చేసింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు లేకపోయినా, లిమిటెడ్ రేట్లతో రిలీజ్ చేసినా మంచి ఓపెనింగ్స్ తో అదరగొట్టింది బ్రో సినిమా.

అయితే ఆ ఆనందం వీకెండ్ వరకే మిగిలింది ప్రొడ్యూసర్లకి. మూడు రోజుల్లో 55 కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ సినిమా వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యేసరికి మొత్తం స్లో అయిపొయింది. ఇక మొదటి వారంలో బ్రో 63 కోట్ల షేర్ రాబట్టగా 105 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. అయితే బ్రో రన్ ఆల్మోస్ట్ పూర్తయింది అనుకునేలోపు పదవ రోజు ఆదివారం హాలిడే అడ్వాంటేజ్ తో మంచి గ్రోత్ చూపించింది బ్రో సినిమా.

బ్రో సినిమా తెలుగు రాష్ట్రాల్లో పదోరోజు 70 లక్షల వరకు రాబట్టొచ్చు అనుకున్నా, అన్ని అంచనాలను మించిపోయి, ఆల్మోస్ట్ డబల్ రేంజ్ లో 1.36 కోట్ల షేర్ సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 1.67కోట్ల షేర్ ని సాధించింది. ఓవరాల్ గా ఇప్పటివరకు బ్రో 66.17 కోట్ల షేర్, 110.90 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అయితే 97కోట్ల బిజినెస్ చేసిన బ్రో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 32 కోట్లు వసూలు చేయాలి. అది అసాధ్యమని తెలుస్తుంది. ఇక టోటల్ ఎండ్ లో మరెంత రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు