Dhanush latest movie buzz : ధనుష్ మరో స్ట్రయిట్ తెలుగు సినిమా

Dhanush latest movie bazz

ధనుష్ సినిమాల లైన్ అప్ చూస్తే నిజంగానే మతి పోతుందని చెప్పాలి. ప్రస్తుతం స్టార్ హీరోలుగా చెలామణిలో ఉన్న అందరు హీరోలు ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేయడానికే నానా కష్టాలు పడుతుంటే.. హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలను కమిట్ అవుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.

గతకొద్ది సంవత్సరాలుగా కేవలం డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ధనుష్ ఇటీవలనే సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ అనే స్ట్రయిట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అంతేకాదు ఈ సినిమాతోనే ఆయన తెలుగులో 100 కోట్ల క్లబ్ లో చేరిన కోలీవుడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేసాడు. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమాతో పాటు పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ తెలుగులో మరో స్ట్రయిట్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఇప్పటికే విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ఒక సినిమా కమిట్ అవ్వగా.. ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవకుండానే మరో తెలుగు డైరెక్టర్ సినిమాను ధనుష్ ఒకే చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకు ఆ తెలుగు డైరెక్టర్ మరెవరో కాదు వేణు ఊడుగుల. నీది నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు ఊడుగుల గతేడాది వచ్చిన విరాటపర్వం సినిమాతో విమర్శకుల ప్రశంషలు పొందాడు. సమాజంలోని అన్యాయాన్ని, అణచివేతను కథా వస్తువుగా చేసుకొని చిత్రాలను రూపొందించే వేణు ఊడుగుల ఇటీవలనే ధనుష్ ను కలిసి కథ వినిపించగా, ఆయనకు కథ బాగా నచ్చి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తమిళ్, తెలుగు బై లాంగ్వేజికల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నట్టు సమాచారం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు