Sir: కోలీవుడ్ స్టార్ ధనుష్ ని బ్యాన్ చేస్తారా?

కోలీవుడ్ స్టార్ ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడిగా చిన్న తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని సినిమాలు చేస్తుంటాడు. ఏ సినిమా చేసినా అందులో తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. కథ నచ్చితే ఎలాంటి రోల్ అయినా చేయడానికి వెనుకాడడు. రీసెంట్ గా “సార్” సినిమాతో మంచి సూపర్ హిట్ కొట్టి జోష్ మీదున్నాడు ధనుష్.

ప్రస్తుతం తమిళ్ లో కెప్టెన్ మిల్లర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఇదే గాకుండా శేఖర్ కమ్ములతో కూడా ఒక సినిమా చేయనున్నాడు ధనుష్.

అయితే ఈ సినిమాలన్ని కాకుండా ధనుష్ హీరోగా ఎప్పుడో తీయాల్సిన ఒక సినిమా పెండింగ్ లోనే ఉంది. ఆ సినిమా వల్ల ఇప్పుడు ధనుష్ కి చాలా సమస్యలు వచ్చిపడ్డాయి. తమిళ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన “శ్రీ తెండ్రల్” ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్టున్నానని ధనుష్ చెప్పడం జరిగింది. అంతే కాక ఆ సినిమా కోసం అడ్వాన్సు కూడా తీసుకున్నాడు. తీరా చూస్తే ఆ సినిమా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అడ్వాన్సు తీసుకొని చాలా ఏళ్ళు అవుతున్నా సినిమా చేయకపోవడంతో ఆ ప్రొడ్యూసర్లు తమిళ నిర్మాత మండలి లో కేసు పెట్టారు. దీంతో నిర్మాతల మండలి నుండి ధనుష్ కి నోటీసులు వెళ్లాయి.

- Advertisement -

అప్పుడు ధనుష్ నుండి సరైన సమాధానం రాకపోతే ధనుష్ ని కోలీవుడ్ నిర్మాతల సంఘం నుండి బ్యాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి పలువురు ట్రేడ్ విశ్లేషకులు కూడా ధనుష్ లాంటి స్టార్ హీరోకి ఇది తగదని, ఒప్పుకున్న సినిమా చేసేస్తే ఏ గొడవ ఉండదని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఎంత నిజముందో నిర్మాతలు క్లారిటీ ఇవ్వాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు