bloody daddy: సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సినిమాలపై షాహిద్ కపూర్ కామెంట్స్ వైరల్

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ లేటెస్ట్ గా సౌత్ ఫిలిం ఇండస్ట్రీల సినిమాపై చేసిన కొన్ని కామెంట్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో సౌత్ నుంచి సినిమాను అస్సలు పట్టించుకోని బాలీవుడ్ నటులు ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాల గురించి మాట్లాడుతుండటం అవి ఇక్కడ మీడియాలో వైరల్ అవుతుండటంతో వీరి కామెంట్స్ కు ఇటీవల కాలంలో ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

ఇక నటుడు షాహిద్ కపూర్ తెలుగు సినిమాలలో నటించకపోయినప్పటికీ ఈయన తెలుగు ఆడియన్స్ కు పరిచయస్తుడే, అలాగే ఈయనకు తెలుగు సినిమా దర్శకులతో పని చేసిన అనుభవం కూడా ఉంది. టాలీవుడ్ సూపర్ హిట్స్ గా నిలిచిన అర్జున్ రెడ్డి, జెర్సీ సినిమాలను షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేసి, హిట్స్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాలకు గాను ఆయన హిందీ దర్శకులతో పని చేయకుండా, ఒరిజినల్ సినిమా తీసిన తెలుగు దర్శకులే కావాలని వారితోనే ఈ సినిమాలు చేసాడు

అయితే ప్రస్తుతం షాహిద్ కపూర్ హిందీ మార్కెట్ తో పాటు సౌత్ ఇండస్ట్రీ మార్కెట్ పై కూడా కన్ను వేసినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్న అన్ని హిందీ సినిమాలను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఇటీవలనే ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ “సౌత్ సినిమాలను హిందీ ప్రేక్షకులు ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా హిందీ సినిమాలను కూడా సౌత్ ప్రేక్షకులు ఆదరించాలి. అప్పుడే ఇండియన్ సినిమా ఎలివేట్ అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు” దాంతో ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు