Manmadhudu2: ఆ హీరోకి ముద్దు పెట్టడం వల్లే రకుల్ జీవితం నాశనమైందా..?

రకుల్ ప్రీత్ సింగ్.. మనందరికీ తెలిసిన టాప్ హీరోయిన్. కెరటం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ లిస్టులో చేరింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. కానీ కొంతకాలంగా టాలీవుడ్ లో అవకాశాలు లేక బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

అయితే తాజాగా ఓ బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ తెలుగు హీరో పై కీలక వ్యాఖ్యలు చేసింది రకుల్. టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న సమయంలో ఓ సీనియర్ హీరోకి లిప్ లాక్ ఇవ్వడం అభిమానులకి నచ్చలేదని.. అందుకే తనని హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని తెలిపింది. అలా తాను పెద్ద తప్పు చేశానని కీలక వ్యాఖ్యలు చేసింది రకుల్. అయితే ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోతో చేసిన ఒకే ఒక సినిమా మన్మధుడు 2. ఈ సినిమాలో అక్కినేని నాగార్జునకి ఆమె లిప్ లాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె నాగార్జునని పరోక్షంగా విమర్శించిందంటూ ఓ టాక్ వైరల్ గా మారింది. దీంతో రకుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో చివరగా నటించిన చిత్రం కొండపొలం. ఈ చిత్రం కూడా ప్లాప్ కావడంతో దర్శకనిర్మాతలు ఆమెపై ఆసక్తి చూపించలేదు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ప్రస్తుతం రకుల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరి ఫ్యూచర్ లో మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెట్టి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుందో..? లేదో..? వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు