Indian2: అలాంటి పని చేశానంటూ ఓపెన్ గా చెప్పిన కాజల్ అగర్వాల్..!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకొని ఆ తర్వాత బిడ్డకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది కాజల్. ప్రస్తుతం కాజల్.. కమల్ హాసన్ ఇండియన్ 2, సత్యభామ సినిమాలలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది కాజల్. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో చాలా డిప్రెషన్ కి గురయ్యానని, ఆ సమయంలో చాలా బాధపడ్డానని పలు కీలక విషయాలను చెప్పుకొచ్చింది.

తన బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ఏదో ఒక కారణంతో చాలా డిప్రెషన్ కి గురయ్యేదాన్ని అని.. ఆ సమయంలో తన భర్త గౌతమ్ తనకి ఎంతో అండగా నిలిచాడని తెలిపింది. తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో అండగా నిలబడ్డారని చెప్పుకొచ్చింది. ప్రతి మహిళ కూడా తల్లి అయ్యాక వ్యాయామానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపాలని సూచించింది. మహిళలు ఎవరైనా సరే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తో ఇబ్బంది పడితే కుటుంబ సభ్యులు వాళ్లకు అండగా నిలబడాలని చెప్పుకొచ్చింది. ఆ విషయంలో తన భర్త తనకు ఎంతో సహాయం చేశారని తెలిపింది. అందువల్లే ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టగలిగానని తెలిపింది.

అయితే తాను ఎక్కువగా ధ్యానం చేస్తానని, ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరంగా ఉంటానని తెలిపింది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడాన్ని కొంతమంది గురువులు నేర్పించారని తెలిపింది. ఇక ఏదైనా సినిమాలో ఒక పాత్రకి న్యాయం చేయలేనప్పుడు చాలా బాధపడతానని తెలిపింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు