Rangabali: మళ్ళీ నోరు జారిన నాగ శౌర్య -కాన్ఫిడెన్సా.. ఓవర్ కాన్ఫిడెన్సా..?

యంగ్ హీరో నాగ శౌర్య మరోసారి నోరు జారాడు. గతంలో అశ్వత్థామ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో మరియు ఆ సినిమా ప్రమోషన్స్ లో పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన నాగ శౌర్య మరోసారి మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.

నాగ శౌర్య హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా రంగబలి, ఈ ఇయర్ దసరా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పవన్ భాసంశెట్టి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ జులై 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి నిన్న సాయంత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, నాగ శౌర్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

“రంగబలి యావరేజ్ సినిమా కాదని హిట్ సినిమా కూడా కాదు రంగబలి ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని శౌర్య అన్నారు. ఆయన ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఆ సినిమాల గురించి మాట్లాడుతుంటే నమ్మకంగా లేకపోయేవాడిని, కానీ రంగబలి సినిమాపై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని ఆయన తెలిపారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఇప్పటివరకు చేసిన అన్నీ సినిమాల్లో కంటే రంగబలి సినిమానే ఎక్కువ ప్రాఫిట్స్ ఇచ్చే సినిమా అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఈ యంగ్ హీరో గతంలో కూడా ఇలాగే ఆయన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో మాట్లడగా ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు విమర్శిస్తున్నారు.

- Advertisement -

సుధాకర్ చెరుకూరి గత చిత్రం దసరా 100 కోట్ల మార్క్ టచ్ చేసింది, నాగ శౌర్య వ్యాఖ్యల పరంగా చూస్తే రంగబలి సినిమా కూడా 100 కోట్ల మార్క్ దాటి కలెక్ట్ చేస్తే ప్రొడ్యూసర్ కు ఇది ప్రాఫిటబుల్ సినిమా అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ఈ యంగ్ హీరో ఎలా మిస్ అయ్యాడు ఊరికే మైక్ దొరికింది కదా అని వాగడమేనా అంటూ నాగ శౌర్యనునెటిజన్లు విమర్శిస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు