Tollywood: సంక్రాంతికి మళ్ళీ సీనియర్ల సమరమేనా?

టాలీవుడ్ లో అతిపెద్ద సినిమా సీజన్ అయిన సంక్రాంతికి ప్రతియేడు పెద్ద సినిమాలు పందెం కోళ్లలా వచ్చి పోటీపడుతుంటాయి. పండగ అడ్వాంటేజ్ తో రిలీజ్ అయ్యే ఆ సినిమాలు టాక్ బాగుంటే నెలరోజుల పాటు హోరాహోరీగా కలెక్షన్లు రాబడతాయి. ఇక ఈ ఏడాది చాలా రోజుల తర్వాత సీనియర్ స్టార్లు పోటీ పడ్డారన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో వచ్చి రచ్చ చేయగా, బాలకృష్ణ వీరసింహారెడ్డి గా వచ్చి వీరంగం సృష్టించాడు. మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చాయి. అయితే ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 240కోట్ల వరకు వసూలు చేయడం విశేషం.

ఇక 2024 సంక్రాంతి కి కుడా పెద్ద సినిమాలు కర్చీఫ్ వేసిన విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలతో పాటు పలువురు సీనియర్ హీరోల సినిమాలున్నాయి. అయితే తాజాగా జరిగిన కొన్ని చేంజెస్ వల్ల సినిమాల రిలీజ్ డేట్లు మారిపోయాయి. కొన్ని సినిమాలు పండగ బరిలో నుండి తప్పుకోగా, మరికొన్ని కంఫ్యూజన్ లో పడ్డాయి. లేటెస్ట్ గా కొన్ని చిన్న సినిమాలు పోటీలో నిలిచాయి.

అయితే వినబడుతున్న వార్తల ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతి కూడా సీనియర్ హీరోలే పోటీపడనున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్రాంతికి తీసుకురావాలన్న పవన్ కళ్యాణ్ ఓజి షూటింగ్ డిలే వల్ల అఫిషియల్ గా తప్పుకుంది. ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా సంక్రాంతికి రావడం లేదు. ఎందుకంటే తన ఫోకస్ మొత్తం సాలర్ పై పెట్టాడు గనుక అది రిలీజ్ అయ్యే వరకు వేరే ప్రాజెక్ట్లు చెయ్యట్లేదు. ఇక మొన్నటి వరకు కంఫర్మ్ అయిన గుంటూరు కారం లేటెస్ట్ గా పూజా హెగ్డేని తీసేయడం వల్ల, స్క్రిప్ట్ లో చేంజెస్ చేయడం వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంది. కాబట్టి సినిమా సమ్మర్ కి షిఫ్ట్ అయ్యిందని అంటున్నారు.

- Advertisement -

ఈ సినిమాలను పక్కన పెడితే మిగిలింది సీనియర్లే. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో చేస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని చుస్తున్నారు. ఇక బాలయ్య బాబీ కాంబో లో వస్తున్న సినిమా కూడా సంక్రాంతికి తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతే కాక వెంకటేష్ నటిస్తున్న “సైంధవ్” ముందుగా క్రిస్మస్ కి ప్లాన్ చేసినా, షూటింగ్ డిలే వల్ల సంక్రాంతికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇవే గాక లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ సినిమా అయితే అఫిషియల్ గా సంక్రాంతి కే తమ సినిమా రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకుంది.

మరి సంక్రాంతి వచ్చే వరకు ఈ సినిమాల్లో ఏది తప్పుకుంటుందో ఏది ఖచ్చితంగా వస్తుందో తెలియక అభిమానులు కన్ఫ్యూజన్ లో పడ్డారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు