Peddakapu : టాలీవుడ్ వెట్రిమారన్ శ్రీకాంత్ అడ్డాల- పెద్ద కాపు టీజర్ విడుదల !

క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రూట్ మార్చాడు. ఈ కాలంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రేలంగి మావయ్యల ఉంటె బతకలేమనుకున్నాడో ఏమో గాని మొత్తానికి క్లాస్ సినిమాలకు ఫుల్ స్టప్ పెట్టి వరుస మాస్ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు. వెంకటేష్ హీరోగా వచ్చిన నారప్ప సినిమాతో గేర్ మార్చిన అడ్డాల, పెద్ద కాపు అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అఖండ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రాబోతున్న ఈ పెద్ద కాపు సినిమాతో విరాట్ కర్ణ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం నడుస్తున్న ప్రాంచైజ్ ట్రెండ్ లో తరహాలో ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం విడుదల చేసారు.

టీజర్ చూస్తుంటే రంగస్థలం తరహాలో ఉండే పల్లెటూరి రాజకీయల్లో చిక్కుకున్న ఒక యువకుడిగా కథగా తెలుస్తోంది. రావు రమేష్, ఆడుకల్లం నరేన్, అనసూయ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.”మా నాన్న ఎప్పుడు ఒక మాట చెబుతుండేవాడు బాగా బతకడమంటే నిన్నటి కంటే ఇయ్యాల బాగుండాలి, ఇయ్యాల కంటే రేపు బాగుండాలని” అనే డైలాగ్ లో శ్రీకాంత్ అడ్డాల మార్క్ కనిపిస్తోంది. బాగా ఓవర్ అల్ టీజర్ చూస్తుంటే తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ వెట్రిమారన్ మేకింగ్ స్టైల్ ను తలపిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ మాత్రం ఒక కులాన్ని హైలెట్ చేస్తుండటంతో. ఇంకెళ్లను కులాల మీద సినిమాలు తీస్తారనే విమర్శలు తలెత్తుతున్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు