King Of Kotha: ఈ సినిమాతో దుల్కర్ ఇండస్ట్రీ హిట్ కొడతాడా?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం మలయాళం లో “కింగ్ అఫ్ కోత్త” అనే సినిమా చేస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, వే ఫారెర్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

ఈ సినిమాలో దుల్కర్ ఒక డాన్ గా నటిస్తున్నాడని టీజర్ ద్వారా తెలుస్తుంది. ఎక్కువగా ప్రేమ కథలు చేసే దుల్కర్ నుంచి ఈ రేంజ్ మాస్ సినిమా వస్తుండడంతో దుల్కర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. టీజర్ ని గమనిస్తే కెజిఎఫ్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. కింగ్ అఫ్ కోత 80స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది.

50కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి ఈ సినిమా మలయాళం లో భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని తెలుస్తుంది. టాక్ బాగుంటే ఇండస్ట్రీ హిట్ కూడా కావొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసాక ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక ఈ సినిమాను 25 ఆగస్ట్ న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు