Tollywood: “స్పై” కలెక్షన్స్..సీన్ రివర్సయ్యిందేంటి?

నిఖిల్ సిద్ధార్థ్ నటించిన “స్పై” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలవలేకపోతుంది. జూన్29న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయినా ఈ సినిమా నిఖిల్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. దాంతో ఈ సినిమాకి తక్కువ బిజినెస్ జరగడం వల్ల బ్రేక్ ఈవెన్ ఈజీ గా అయిపోతుందనుకున్నారు. కానీ రోజు రోజుకి వసూళ్లు తగ్గుతుండడంతో “స్పై” ఇక బ్రేక్ ఈవెన్ అవ్వదని తెలుస్తుంది. వీకెండ్ కాబట్టి సినిమా ఎలాగైనా మంచి గ్రోత్ చూపిస్తుందనుకున్న డిస్ట్రిబ్యూటర్ల ఆశలు అడియాశలవుతున్నాయి.

ఫస్ట్ డే భారీ కలెక్షన్లు వచ్చిన ఈ సినిమాకి రెండో రోజు కలెక్షన్లు దెబ్బేసాయి. అయితే మూడో రోజు శనివారం వీకెండ్ కావడంతో “స్పై” మంచి గ్రోత్ చూపిస్తుందనుకుంటే రివర్స్ లో రెండో రోజు కంటే తక్కువ
కలెక్షన్లు వసూలు చేసింది. రెండో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.86కోట్లు షేర్ వసూలు చేసింది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.01కోట్లు, వరల్డ్ వైడ్ గా 1.41 కోట్ల షేర్ రాబట్టింది.

ఇక మూడు రోజులు పూర్తయ్యే సరికి “స్పై” సినిమా వరల్డ్ వైడ్ గా 9.29కోట్ల షేర్ ని 16.50 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 9.21 కోట్లు కావాలి. సామజవరగమన చిత్రం ఎఫెక్ట్ దీనిపై బాగా పడిందని చెప్పవచ్చు. ఇప్పుడు “స్పై” సినిమాకి ఆదివారం వచ్చే వసూళ్లే కీలకం కానున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు