Chandoo Mondeti : నాగ చైతన్య సినిమాకి ఆ హీరో అడ్డుపడుతున్నాడా ?

నాగ చైతన్య, కార్తికేయ 2 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి సినిమాచేయబోతున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్న, సినిమాపై ఇప్పటి వరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. కారణం ఏమై ఉంటుందా అనుకుంటున్నారా.

అయితే డైరెక్టర్ చందు మొండేటి ఈ సినిమా కథని మొదట తమిళ నటుడు సూర్యకి వినిపించారట. సూర్యకి చందు చెప్పిన పాయింట్ నచ్చడంతో ఆ మధ్య ఈ సినిమాపై చెన్నైలో వీరిద్దరికి చర్చలు కూడా జరిగాయట. ఆ తరువాత కంగువ సినిమా షూటింగ్ లో బిజీ అయిన సూర్య ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ చేయలేదంట. దాంతో చందు మొండేటి హైద్రాబాద్ కి రిటర్న్ వచ్చి, నాగ చైతన్యకు కథ వినిపించగా చై వెంటనే ఒకే చెప్పేసాడట గతంలో చై, చందు మొండేటితో కలిసి ప్రేమమ్, సవ్యసాచి సినిమాకు పని చేయగా వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా సినిమా చై, సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

అయితే ఈ సినిమాని ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించట్లేదు కారణం సూర్య కథ వినిపించి, ఆయన కన్ఫర్మేషన్ లేకుండా సినిమా స్టార్ట్ చేస్తే వివాదాస్పదమవుతుందనే ఆలోచనతో అల్లు అరవింద్ సూర్య నుంచి ఆమోదం వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పారట. సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనె షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ గా ఉన్న, సూర్య నుంచి ఇప్పటి వరకు రిప్లై రాకపోవడంతో మూవీ టీం సందిగ్ధంలో పడిపోయింది. లోలోపల మాత్రం సినిమాకి సంబంధించి వర్క్స్ జరుగుతున్న కూడా అఫీషియల్ గా ఈ విషయాన్నీ ప్రకటించడానికి మూవీ యూనిట్ ముందు వెనక ఆలోచిస్తున్నారు. మరీ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో, ఉండదో సూర్య డిసైడ్ చేస్తే గాని చెప్పలేం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు