Saamajavaragamana: జస్ట్ 3డేస్… టార్గెట్ ఔట్

శ్రీ విష్ణు హీరోగా నటించిన “సామజవరగమన” సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఏ అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకోవడమే కాదు, చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకి రప్పించింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు తక్కువ ఓపెనింగ్స్ తో డీసెంట్ స్టార్ట్ దక్కించుకుంది. కానీ మంచి సినిమా అన్న టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవడంతో సామజవరగమన రెండో రోజు నుంచి పలు ఏరియాల్లో గ్రోత్ చూపించింది.

సామజవరగమన విడుదలైన మొదటి రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.18కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక మూడోరోజు పాజిటివ్ మౌత్ టాక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి థియేటర్లకు రప్పించుకున్న ఈ సినిమా భారీ గ్రోత్ చూపించింది. మూడో రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.17 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా, ప్రపంచ వ్యాప్తంగా 1.72కోట్ల కి పైగా షేర్ ని వసూలు చేసింది. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.90 కోట్ల షేర్ ని, 7.30 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

ఇకపోతే 3.50 కోట్ల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి 40లక్షల ప్రాఫిట్ తో నిలిచింది. అయితే “స్పై” చిత్రం వల్ల ఈ సినిమా కు ఎఫెక్ట్ పడుతుందనుకున్నా దీని వల్లే స్పై కి వసూళ్లు తగ్గాయి. ఇక “సామజవరగమన” చిత్రానికి ఇక మీదట వచ్చేదంతా లాభాలే అని చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ సినిమా పదికోట్లకి పైగా వసూలు చేసే అవకాశం ఉంది. మరి రానున్న రోజుల్లో సామజవరగమన ఎన్ని కలెక్షన్స్ వసూలుచేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు