Sir: హను ప్రశంసలు

హను రాఘవాపుడి ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించడంలో మేటి. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హను, తన కెరియర్ లో ప్రేమ కథా చిత్రాలనే ఎక్కువగా తెరకెక్కించాడు. తన సినిమాల సెకాండాఫ్ విషయంలో విమర్శలు ఎదుర్కునే హను, సీతరామం సినిమాతో దానిని బ్రేక్ చేసి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

గత ఏడాది రిలీజైన ఈ సినిమా ఒక స్లో పాయిజన్ లా ఆడియన్స్ కి ఎక్కింది. ఒక మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువు చేసారు సీతారామం సినిమాతో, అదే టైమ్ లో రిలీజైన బింబిసార సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అయింది.ఈ ఏడాదిలో మంచి రెస్పాన్స్ సాధిస్తున్న సినిమా “సార్”

వెంకీ అట్లూరి మొదటిసారి తన జోనర్ అయినా లవ్ బ్రాక్డ్రాప్ నుండి బయటకు వచ్చి, ఒక సినిమా చేసారు. ధనుష్ తెలుగులో చేసిన మొదటి డైరెక్ట్ సినిమా ఇది. ఈ సినిమాను ఊహించని హిట్ సినిమాగా మలిచారు.
ఈ సినిమాపై సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.

- Advertisement -

సార్ చిత్రం నా ఊహాతీతంగా ఉంది అని ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి అని ధనుష్ గారు తన నటనతో కట్టిపడేసారు వెంకీ అట్లూరి రైటింగ్ గాని స్క్రీన్ ప్లే గాని చాలా హానెస్ట్ గా ఉన్నాయని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారికి మంచి సినిమా ఇచ్చినందుకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నానని అయితే తాను తెలిపారు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు