Urfi Javed: రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశా

ఉర్ఫీ జావేద్... గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటిటి బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయింది ఉర్ఫీ జావేద్. షో వచ్చి ఎలిమినేట్ అయిన తొలి BB OTT కంటెస్టెంట్ ఆమె. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా ఆమె వేసుకునే డ్రెస్సులు, ఉఫ్ ఉర్ఫీ, ఇవేం డ్రెస్సులు అనిపించేలా ఉంటాయి.

ఆమె వెరైటీ దుస్తుల వల్లే నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఉర్ఫీ ఇంటి పేరు కారణంగా జావేద్ అక్తర్ మేనకోడలు అని కూడా పుకార్లు వచ్చాయి. ఇదిలా ఉండగా,తాజాగా ఉర్ఫీ జావేద్, తన చిన్నతనంలో తన తండ్రితో తనకున్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పుడు తమను ఉత్తమ తండ్రి నిత్యం హింసించేవాడని చెప్పింది. ఐదుగురు తోబుట్టుల్లో తాను రెండోదాన్నని, మా అందరిని మా నాన్న ఎప్పుడూ తిడుతూ, కొడుతూ హింస పెట్టేవాడని వెల్లడించింది. మా అమ్మను కూడా నాన్న నోటికి వచ్చినట్టుగా తిట్టి కొట్టేవాడని తెలిపింది. అమ్మతో సహా తామంతా నరకం అనుభవించామని చెప్పింది.

ప్రస్తుతం డర్టీ మ్యాగజిన్ కవర్ ఫోటోషూట్ లో ఉన్న ఉర్ఫీ జావేద్ కొత్తగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది. తన తండ్రి హింస భరించలేక తాను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని తెలిపింది. తనకు మోడ్రన్ గా బయటకు వెళ్లాలని ఉండేదని, కానీ మా నాన్న అందుకు అంగీకరించేవారు కాదని ఉర్ఫీ జావేద్ చెప్పుకొచ్చింది. టీవీలో ఎప్పుడు ఫ్యాషన్ షోలు చూడడం వల్ల తనకు ఫ్యాషన్ దుస్తులపై మక్కువ ఏర్పడిందని, నాకు పెద్దగా ఫ్యాషన్ పరిజ్ఞానం లేకపోయినా ఎలాంటి ఫ్యాషన్ వస్త్రాలు ధరించాలో తెలుసని పేర్కొంది.

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు