15 years for Kick: కిక్ మూవీకి 15 యేళ్లు.. ఎంత కలెక్ట్ చేసిందంటే..?

15 years for Kick.. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్ గా ప్రముఖ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కిక్.. ఆర్ ఆర్ వెంకట్.. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించారు.. 2009 మే 8వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఈరోజుతో 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ 15 సంవత్సరాల కిక్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంత సాధించింది అనే విషయం ఇప్పుడు చూద్దాం..

15 years for Kick: 15 years of Kick movie.. How much did it collect..?
15 years for Kick: 15 years of Kick movie.. How much did it collect..?

నైజాం – రూ.7.53 కోట్లు

సీడెడ్ – రూ.2.72 కోట్లు

- Advertisement -

ఉత్తరాంధ్ర – రూ.3.12 కోట్లు

ఈస్ట్ – రూ.0.94 కోట్లు

వెస్ట్ – రూ.0.93 కోట్లు

గుంటూరు – రూ.1.7 కోట్లు

కృష్ణా – రూ.1.03 కోట్లు

నెల్లూరు – రూ.0.84 కోట్లు

ఏపీ + తెలంగాణ – రూ.18.89 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ రూ.3.86 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా రూ.22.75 కోట్లు

ఇక ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.13.77 కోట్ల బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ .22.75 కోట్ల షేర్ ను రాబట్టింది.. అంటే బయ్యర్లకి ఈ సినిమా రూ.8.95 కోట్లు లాభాలు దక్కినట్టు తెలుస్తోంది.. ఇక అదే ఏడాది ఈ సినిమాకి పోటీగా విడుదలైన మగధీర, అరుంధతి సినిమాలో కూడా అంతే స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి. ఇక ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అప్పట్లో రేర్ రికార్డు అని చెప్పవచ్చు. మగధీర , అరుంధతి తర్వాత అత్యధిక లాభాలను మిగిల్చిన మూవీగా ఈ సినిమా నిలిచింది.

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. వరుస సినిమాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన జోనర్ తో సంబంధం లేకుండా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో తన నటనతో మెప్పించారు. సినీ ఇండస్ట్రీలోకి హీరో అవుదామని అడుగుపెట్టి మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో మెప్పించి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత సింధూరం సినిమాతో హీరోగా ప్రేక్షకులను మెప్పించారు. ఇక తర్వాత తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన చిరంజీవి వంటి స్టార్ హీరోలు సినిమాలలో సెకండ్ హీరో పాత్రలలో కూడా మెప్పించారు . ఇంకా గత రెండేళ్ల క్రితం ధమాకా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ క్రాక్, కిక్కు సినిమాలతో మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా 56 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాను ప్రకటిస్తూ.. మరింత బిజీగా మారారు రవితేజ. మరి తన తదుపరి చిత్రాలతో ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు