15 years for Kick: మంచి కిక్ ఇచ్చిన దొంగ

15 years for Kick: కొన్నిసార్లు కొన్ని కాంబినేషన్స్ అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. అలా వర్కౌట్ అయిన సినిమాలలో కిక్ సినిమా ఒకటి. సురేందర్ రెడ్డి రవితేజ కాంబినేషన్లో వచ్చిన కిక్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కిక్ సినిమా అప్పట్లో సృష్టించిన సంచలనం మామూలుది కాదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. రవితేజ లోని కామిక్ టైమింగ్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన సినిమా ఇది. ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందించారు. వక్కంతం వంశీ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి.

ఇక కిక్ కథ విషయానికి వస్తే…
మలేషియా నేపథ్యం లో కథ మొదలవుతుంది. నైనా (ఇలియానా) ఒక నిజాయితీ గల పోలీసాఫీసర్ అయిన కళ్యాణ్ కృష్ణ (శ్యామ్) పెళ్ళి చూపుల వలన కలుస్తుంది. వారిద్దరికీ ఇంచుమించు సంబంధం కుదురుతుంది. ఇద్దరూ పరిచయం చేసుకునేటప్పుడు అతని పేరులోని కళ్యాణ్ అనే పదాన్ని విని అతనికి తన గతాన్ని గురించి తెలియ జేస్తుంది. ఆమెకు పరిచయమైన కళ్యాణ్ గురించి చెబుతుంది.

కళ్యాణ్ (రవితేజ) బాగా చదువుకున్న కుర్రాడు. తెలివైన వాడు. ఏ ఒక్క ఉద్యోగంలోనూ కొద్ది రోజులు కూడా పనిచేయడు. చేసే ప్రతి పనిలోనూ కిక్ ఉండాలని కోరుకుంటుంటాడు. నిజానికి కళ్యాణ్ ఒక దొంగ. అయితే అతను ఎందుకు దొంగగా మారాడనే దాని వెనుక ఒక సంఘటన ఉంటుంది. ఒక చిన్న పాపకు ప్రాణాంతకమైన జబ్బు చేయడంతో ఆ పాప తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రయత్నించి ఆమెకు శస్త్రచికిత్స చేయించలేక, పాప చావును చూడలేమంటూ ఉత్తరం రాసి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు.

- Advertisement -

ఆ సంఘటన కళ్ళారా చూసిన రవితేజ చలించిపోయి ఆ పాపను బ్రతికించడానికి తనకున్న ఆస్థులను తెగనమ్మి శస్త్రచికిత్స చేయిస్తాడు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత ఆమె కళ్ళలో ఆనందం చూసి ఆమెలాంటి మరెందరో పిల్లలకు వైద్యం చేయించడానికి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ దొంగతనాలు మాత్రం అన్యాయాలు, అక్రమాలు చేసి కోట్లు గడించిన ప్రముఖుల ఇళ్ళలోనే చేస్తుంటాడు.

ఇకపోతే సమ్మర్లో రిలీజ్ అయిన ఈ కిక్ సినిమా చాలామందికి కూల్ హిట్ అనిపించింది. ఈ సినిమాల్లో రవితేజ క్యారెక్టర్ డిజైన్ చేసే విధానం చాలామందికి పిచ్చిపిచ్చిగా నచ్చింది. రవితేజ ఇలియానా మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. అయితే వీటన్నిటిని మించి ఈ సినిమాకి థమన్ అందించిన మ్యూజిక్ అద్భుతమని చెప్పొచ్చు. ఈ సినిమాతోనే థమన్ కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాతోనే థమన్ కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఇకపోతే ఈ కాంబినేషన్లో మళ్లీ కిక్ 2 అనే సినిమా కూడా వచ్చింది. అయితే కిక్ సినిమా చూపించిన ఇంపాక్ట్ కిక్ 2 సినిమా చూపించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన కిక్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
కానీ కిక్ సినిమా ఇచ్చిన కిక్ 15 ఏళ్ళు అయిన ఇంకా దిగలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు