Junior NTR: ఎన్టీఆర్ ని నిలువునా ముంచేస్తున్న స్టార్ హీరో… సోషల్ మీడియాను హోరెక్కిస్తున్న లేటెస్ట్ న్యూస్..!

Junior NTR: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్టేటస్ అందుకున్న హీరోలకు సంబంధించిన అనేక వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ను మరొక పాన్ ఇండియా హీరో తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అదేంటి ఇద్దరూ బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు అనుకుంటున్నారా? బావబావే పేకాట పేకాటే? అన్నట్లు వీరు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు.

The star hero who is drowning NTR
The star hero who is drowning NTR

ఇక దీని గురించే ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ హీరో తొక్కేయడమేంటి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఫ్యాన్స్ అభిప్రాయం మాత్రమే అయినట్లు తెలుస్తుంది. మనకు తెలుసు బన్నీ పాన్ ఇండియా మరియు తారక్ సినిమాలను ఓకే చేస్తున్నాడు. ఒకే ఒక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడు. అఫ్కోర్స్ బన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకి గాను ఏకంగా 130 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే పరోక్షంగా బన్నీ జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కేస్తున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం తో పాటు పుష్ప సినిమాలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు కూడా అంతే. త్రిబుల్ ఆర్ తరువాత చాలా గ్యాప్ తీసుకుని మరీ దేవరా అనే సినిమాని రిలీజ్ చేయనున్నాడు తారక్. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని వార్ 2 రిలీజ్ చేయనున్నాడు. ఈ సమయంలోనే పుష్ప 2 రిలీజ్ కానుంది. అలా పరోక్షంగా ఎన్టీఆర్ ని దెబ్బతీస్తున్నాడు అల్లు అర్జున్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు