Tillu Square latest buzz : టిల్లు అన్న డీజే సౌండ్ వినిపించట్లేదు

గతేడాది చిన్న సినిమాగా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాదించిన డీజే టిల్లు సినిమా గురించి అందరికి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. క్రైమ్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమా వస్తుంది.

నిజానికి డీజే టిల్లు సినిమా జనాల్లోకి బాగా వెళ్ళడానికి చాలా వరకు హెల్ప్ అయింది.. ఆ సినిమా టైటిల్ సాంగ్. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సంయుక్తంగా ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయగా, థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమాలో చార్ట్ బస్టర్ గా నిలిచిన టిల్లు అన్న డీజే పెడితే అనే సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తరువాత డీజే టిల్లు సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన మిగితా పాటలు, ట్రైలర్ లు అన్నీ జనాలను బాగా ఆకట్టుకోవడంతో డీజే టిల్లు సినిమాకు ప్రేక్షకాదరణ లభించింది.ఇక సినిమా కూడా ఆధ్యంతం ఎంటర్టైనింగ్ గా సాగడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాదించింది.

అయితే డీజే టిల్లు సినిమాకు జరిగిన ఆ మ్యాజిక్ టిల్లు స్క్వేర్ కు జరగటం లేదు. ఇటీవలనే ఈ సినిమాకు సంబంధించి మొదటి పాటను రిలీజ్ చేసారు. రామ్ మిరియాల ఆలపించిన ఈ సాంగ్ వినసొంపుగానే ఉన్న సినిమా ప్రమోషన్స్ కు మాత్రం పనికి రావట్లేదనే చెప్పాలి. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉంది. అంతలోపు సినిమాపై బజ్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశ్యం తో రిలీజ్ చేసిన ఈ సినిమా మొదటి పాట ఆశించినంత రేంజ్ లో వర్క్ అవుట్ అవకపోవడంతో సినిమా రిజల్ట్ పై అందరికి అనుమానాలు వస్తున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు