BRO movie collections: ఏంటి బ్రో ఇలా అయింది- బేబీ కంటే తక్కువ “బ్రో “

BRO movie collection huge drop

స్టార్ హీరో సినిమాలకు మొదటి వారం కలెక్షన్సే చాలా కీలకం అనే విషయం అందరికి తెలిసిందే. బడా నిర్మాతలందరు స్టార్ హీరోలు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి, ఎంత కష్టమైనా వాళ్ళతోనే సినిమా చేయడానికి రెడీ అయ్యేది, మొదటి వారమే వాళ్ళు పెట్టిన మొత్తం బడ్జెట్ రికవరీ చేసి, ఆ తరువాత లాభాల గడించవచ్చని.. కానీ కొన్ని సార్లు అలా జరగదు. తీవ్రం గా నష్ట పోవాల్సి కూడా వస్తుంది.

ప్రస్తుతం బ్రో సినిమా పరిస్థితి అలాగే ఉంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రం జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవర్ స్టార్ మ్యానియా తో మొదటి మూడు రోజులు ఒక మాదిరిగానే కలెక్ట్ చేసిన బ్రో సినిమా సోమవారం రోజుకి కంప్లిట్ గా పడిపోయింది. ఎంతగా పడిపోయిందంటే ఇటీవలనే చిన్న సినిమాగా రిలీజైన సంచలన విజయం సాధిస్తున్న బేబీ సినిమా కంటే కూడా పవన్ కళ్యాణ్ బ్రో సినిమా అతితక్కువ కలెక్ట్ చేసేంతల పడిపోయింది.

తమిళ్ లో సూపర్ హిట్టైన వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కిన బ్రో సినిమాపై ముందు నుంచే చాలా నెగిటివిటి ఉంది. దీనికి కారణం కంటిన్యూస్ పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడమే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో సినిమాకు గాను పవన్ కళ్యాణ్ అక్షరాల 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు కలెక్షన్స్ వస్తాయి, ఆయన పేరు వినిపిస్తే చాలు డబ్బులు కుప్పలా కింద వచ్చి పడతాయి అని చెప్పే మాటలు కేవలం గాలి మాటలే అని మరోసారి రుజువైంది.

- Advertisement -

ఇటీవలనే రిలీజైన బేబీ సినిమా నాలుగవ రోజు 3.2 కోట్లు కలెక్ట్ చేయగా, బ్రో సినిమా కేవలం 2.5 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. దీనిబట్టి చూస్తే స్టార్స్ నమ్ముకుని సినిమాలు తీసే కన్నా కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసింది ఉత్తమమైన పని అని తెలుస్తోంది. నిజానికి పవన్ ఫ్యాన్స్ ముందు నుంచి బ్రో సినిమా కంటే OG సినిమాపైనే ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. మరి OG సినిమా ద్వారానైన పవన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడో లేడో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు